Spine-chilling Video: Woman Dragged by Moving Car in Delhi కారులోంచి యువతిని పట్టుకుని ఈడ్చుకెళ్లిన చోదకుడు అరెస్ట్

Woman dragged by moving car in delhi s amar colony spine chilling video goes viral

woman dragged by moving car, woman dragged by moving car in south-east Delhi, woman dragged by moving car in Amar colony area, woman assaulted by two car drivers, woman slapped by two car drivers, spine-chilling video of southeast Delhi, delhi road rage, delhi girl dragged, delhi girl abuse, south delhi, girl dragged, Udayvir Singh arrested in woman dragged case, south-east Delhi, Crime

A spine-chilling video of a woman being dragged by a moving car in southeast Delhi’s Amar Colony area has created quite an uproar. As per reports, the woman was allegedly assaulted when she tried to intervene between two arguing drivers so that her cab could pass. She was allegedly slapped and dragged by at least two youths in a car.

ITEMVIDEOS: కారులోంచి యువతిని పట్టుకుని ఈడ్చుకెళ్లిన చోదకుడు అరెస్ట్

Posted: 05/05/2022 07:58 PM IST
Woman dragged by moving car in delhi s amar colony spine chilling video goes viral

కదులుతున్న కారులో కూర్చున్న వ్యక్తి కారు ఎదురుగా నిల్చుని మాట్లాడుతున్న మహిళపై అత్యంత కిరాతకచర్యకు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. రోడ్డుపై కారును నిలిపి తన క్యాబ్ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన ఇద్దరు యువకులను తమ డ్రైవర్ తప్పేముందని అలా తిడుతున్నారు.. అని నిలదీసినందుకు.. వారిద్దరూ కలసి అమెపై దాడి చేయడమే కాకుండా కారును అడ్డుకోబోయిన యువతిని పట్టుకుని కారుతో పాటు ఈడ్చుకెళ్లి.. వేగాన్ని అందుకున్న తరువాత అమెను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. దీంతో వేగంగా రోడ్డుపై పడిన యువతి తీవ్రగాయాలపాలైంది.

దేశ రాజధాని ఢిల్లీలోని అమర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన యువతి రెండు రోజుల తరువాత ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు అప్పటికే రంగంలోకి దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 29 అర్థరాత్రి వేళ ఒక మహిళ క్యాబ్‌లో తన ఇంటికి చేరుకుంటోంది. ఓఖ్లా మండి చౌక్ వద్దకు ఆ క్యాబ్‌ చేరగా రోడ్డు మధ్యలో రెండు వాహనాలు నిలిపిన ఇద్దరు కారుడ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. అప్పటికే కొద్దీ సమయం వేచిచూసిన మహిళ ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవర్‌..  తమకు దారి ఇస్తే వెళ్తామని వారికి చెప్పారు.

అయితే రెండు కార్లు ఆయన మాటలను లక్ష్యపెట్టకపోవడంతో ఆయన బాలెనో కారులోని వారిని దారిని ఇవ్వాలని అడిగాడు. అయితే అందులోని వ్యక్తులు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను తిట్టారు. అవతలి కారును అడగకుండా తమనే ఎందుకు అడుగుతున్నావ్ అంటూ దుర్బాషలాడారు. దీంతో క్యాబ్ లో కూర్చోని ప్రయాణిస్తున్న మహిళ కల్పించుకుంది. క్యాబ్‌ డ్రైవర్‌పై తప్పేముందుని ఆయనతో అగౌరవంగా మాట్లాడుతున్నారని  ప్రశ్నించింది. దీంతో నీ పని చూసుకో అంటూ ఒకరు ఆమెను కూడా తిట్టాడు. ఆగ్రహించిన ఆ మహిళ ఆ వ్యక్తి చెంపపై కొట్టింది. దీంతో ఆ వ్యక్తి ఆమెను పలుసార్లు చెంపపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

మరోవైపు కారులోని అతడి స్నేహితుడు మహిళ వద్దకు వచ్చి ఆమె చెంపపై కొట్టాడు. దీంతో ఆ కారును ఆపేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే కారు వేగం పెంచి ఆమెను కొంత దూరం ఈడ్చికెళ్లారు. అనంతరం ఆ మహిళ రోడ్డుపై పడగా మోకాలికి గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫరీదాబాద్‌కు చెందిన కారు యజమాని 25 ఏండ్ల ఉదయవీర్ సింగ్‌ను అరెస్ట్‌ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles