Central Bank of India to close 13% of its branches సెంట్రల్ బ్యాంక్ అప్ ఇండియా 600 శాఖ‌ల మూసివేత‌!

Central bank of india to close 13 of its branches report

Central Bank of India to close its branches, Central Bank, Central Bank branch india, financial health, Central Bank news, Central Bank of India, PSU, Finance, RBI, PCA, Central Bank Branches, CBI, Government-owned bank, nationalised bank

Central Bank of India, a state-owned commercial bank, plans to shut 13% of its branches to improve its financial health, which has been under pressure for several years, according to sources and a document seen by Reuters. The bank is looking to reduce the number of branches by 600 by either shutting down or merging loss-making branches by the end of March 2023, according to the copy of a document reviewed by Reuters.

సెంట్రల్ బ్యాంక్ అప్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. 600 శాఖ‌ల మూసివేత‌.!

Posted: 05/05/2022 06:25 PM IST
Central bank of india to close 13 of its branches report

కేంద్ర ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికంగా బ‌లోపేతానికి సిద్ధ‌ప‌డింది. దేశవ్యాప్తంగా 13 శాతం శాఖ‌లను మూసివేయ‌డం లేదా విలీనం చేయాల‌ని నిర్ణ‌యించింది. బ్యాంక్ కొన్నేండ్లుగా ఒత్తిడికి గుర‌వుతున్న‌దని స‌మాచారం. దేశ‌వ్యాప్తంగా 600 శాఖ‌ల‌ను మూసివేయ‌డం గానీ, న‌ష్టాల్లో ఉన్న శాఖ‌ల‌ను స‌మీప శాఖ‌ల్లో విలీనం చేయ‌డం గానీ చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

వ‌చ్చే ఏడాది మార్చి నాటికి శాఖ‌ల కుదింపు నిర్ణ‌యం అమ‌ల్లోకి రానున్న‌ద‌ని ఓ వార్త సంస్థ క‌థ‌నం. బ్యాంక్ ఆర్థిక స్థితిగ‌తుల‌ను మెరుగు ప‌రిచేందుకు నాన్‌కోర్ అసెట్స్, ఇండ్ల స్థ‌లాల వంటి వాటిని విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింద‌ని స‌మాచారం.ఇంత‌కుముందు పొదుపు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వార్త‌లొచ్చినా, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ‌ల మూసివేత అంశం ప్ర‌స్తావ‌న‌కు రాలేదు.

100 ఏండ్ల‌కు పైగా చ‌రిత్ర గ‌ల సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు 4,594 శాఖ‌లు ఉన్నాయి. 2017లో ఆర్బీఐ రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, నిబంధ‌న‌ల‌ను కొన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఉల్లంఘించాయ‌ని వినికిడి. ఆ త‌ర్వాత సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిన‌హా మిగతా బ్యాంకులు కోలుకున్నాయి. శాఖ‌ల కుదింపు లేదా విలీనంపై స్పందించ‌డానికి సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles