happy ending to the kidnaped boy at tirumala తిరుమలలో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడు కథ సుఖాంతం

Happy ending to the kidnaped five year old boy at tirumala

boy kidnapped in tirumala, five year old kidnapped in tirumala, kidnap, Boy Kidnap at Tirumala, five years old kidnaped in Tirumala, TTD, Tirumala, Tirupati, Tirupati News, Tirupati Latest News, Tirupati Today News, AP News, Andhra Pradesh, Crime

The kidnap case of a five-year-old boy Govardhan in Tirumala ended on a happy note after police found the kidnapper. It is learned that a woman kidnapped a boy in front of Tirumala temple on the 1st of this month. Police teams have taken steps to find out the whereabouts of a boy for the last five days and found the kidnapper and the boy when the former has brought the boy to Tirumala once again.

తిరుమలలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం.. మతిస్థిమితం లేని మహిళ నిర్వాకం..

Posted: 05/05/2022 01:38 PM IST
Happy ending to the kidnaped five year old boy at tirumala

భక్తుల పాలిట కొంగుబంగారం, ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల సప్తగిరుల నుంచి కిడ్నాపైన ఐదేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. గతంలోనూ ఏడు కొండలపై నుంచి ఓ చిన్నారి కిడ్నాప్ కాగా.. రెండు రోజుల వ్యవధిలో ఆ బిడ్డను వెతికి పట్టుకున్న పోలీసులు బిడ్డను తల్లిదండ్రులతో కలిపారు. దీంతో ఈ పుణ్యక్షేత్రం నుంచి ఏ తల్లికి బిడ్డ దూరమైనా తిరిగి ఆ తల్లి చెంతకు చేరుతాన్న నమ్మకం కూడా భక్తులలో బలపడుతోంది. అయితే తాజాగా కిడ్నాప్ అయిన చిన్నారి స్థానికులైన తిరుపతికి చెందిన బిడ్డ కావడం గమనార్హం. ఓ మతిస్థిమితం లేని మహిళ చేసిన నిర్వాకం.. తిరుమల పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మతిస్థిమితం లేని మహిళ ఐదేళ్ల చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు తేలింది. తిరుమలలోని గొల్లమండపం సమీపంలో గత ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో కుమారుడి కోసం గాలించిన తల్లి సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడి తండ్రి ఓ హోటల్‌లో పనిచేస్తుండగా, తల్లి స్వాతి శ్రీవారి ఆలయ సమీపంలో భక్తుల నుదుట గోవింద నామాలు పెడుతూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు.

తల్లిదండ్రుల పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడ్ని కిడ్నాప్ పై సీసీటీవీ ఫూటేజీలను పరిశీలించారు. ఆదివారం సాయంత్రం గొల్లమండపం సమీపంలో బాలుడి వద్దకు వచ్చిన గుర్తు తెలియని మహిళ అతడికి స్వీట్లు తినిపించి ఆపై తనతోపాటు తీసుకెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. పింక్ చుడీదార్ ధరించిన మహిళ బాలుడిని తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో రికార్డయింది. సదరు మహిళ బాలుడితో పాటుగా ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్టుగా గుర్తించారు. 03 జెడ్ 0300 నెంబర్ కలిగిన ఆర్టీసీ బస్సులో ఆమె తిరుపతి చేరుకుందని కనుగొన్నారు.

అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న వివరాలు సేకరించి.. మహిళను పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న పోలీసులకు ఆడబోయిన తీర్థం ఎదురైంది. పోలీసులకు పని తగ్గిస్తూ పిల్లాడిని నేరుగా అప్పగించేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు బాలుడ్ని కిడ్నాప్ చేసిన మహిళ తల్లిదండ్రులు. బాలుడితో పాటు నేరుగా మైసూరులోని తన ఇంటికెళ్లిన మహిళకు అమె తల్లిదండ్రుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. చిన్నారి వివరాలు తెలుసుకుని బాలుడితో పాటు తిరుమల చేరుకున్నారు. చిన్నారిని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. తమ కుమార్తె పేరు పవిత్ర అని, ఆమెకు మతిస్థిమితం లేదని వారు చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులను సమాచారం అందించిన పోలీసులు వారికి బాబును అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles