Supreme Court hope for Rajiv Gandhi assassination convict రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి విడుదలపై కేంద్రానికి సుప్రీం అల్టిమేటం..

Ready to release perarivalan if centre has nothing to argue says supreme court

A G Perarivalan, release of A G Perarivalan, Supreme Court Central Government, Tamil Nadu Governor, Rajiv Gandhi assassination case, mercy plea, President of India, Supreme Court, Nalini Sriharan, Rajiv Gandhi, assassination case, Murugan, Santhan, Perarivalan, Perarivalan death, Tamil Nadu, Crime

The Supreme Court said the Tamil Nadu Governor was bound by the decision of the state cabinet on the release of A G Perarivalan, who has served 36 years of his life term in the Rajiv Gandhi assassination case and disapproved of his action sending the mercy plea to the President saying it cannot shut eyes to something against the Constitution.

రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి విడుదలపై కేంద్రానికి సుప్రీం అల్టిమేటం..

Posted: 05/05/2022 03:39 PM IST
Ready to release perarivalan if centre has nothing to argue says supreme court

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరరివాలన్ విడుదల విషయంలో ఈ నెల పదో తేదీ లోగా తేల్చాలని, లేదంటే అవసరమైన ఆదేశాలను తామే జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తదుపరి వాదనలేవీ లేవని కనుక కేంద్రం భావిస్తే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం, ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగానే దీనిని భావిస్తున్నట్టు పేర్కొంది.

పేరరివాలన్ విడుదల విషయమై ఈ నెల 10లోగా ఏదో ఒక తేల్చిచెప్పాలని కేంద్రానికి అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం అల్టిమేటం జారీ చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. దీంతో పేరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని, కాబట్టి ఆయన నిర్ణయంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరాడు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ పీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే, తమ తరపున వాదించేందుకు ఎలాంటి అంశాలు లేవని కేంద్రం తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన న్యాయస్థానం ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగా దీనిని పరిగణిస్తున్నామని చెప్పింది. ఇక తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం కనుక స్పష్టంగా చెప్పేస్తే పేరరివాలన్ విడుదలపై ఉత్తర్వులు జారీ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles