Fact Check: Rahul Gandhi with Chinese envoy at night club నైట్‌క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ పక్కనుందీ రాయభారి కాదు..

Fact check rahul gandhi seen with chinese envoy in nepal baseless rumour spreads like wildfire

Rahul Gandhi, Nepal envoy, Rabin Shrestha, Lord of the Drinks, pub’s management, Kathmandu, Chinese ambassador, BJP, Pathankot, PM Modi Pakistan, Nawaz Sharif', Uninvited guest, Congress, Randeep Surjewala, Netizens, National politics

Congress leader Rahul Gandhi's visit to Nepal for a friend's wedding triggered a barrage of tweets from the BJP and its supporters. But the pub’s management in Kathmandu. Rabin Shrestha, the CEO of Lord of the Drinks, confirmed in a phone call that Gandhi visited the pub on May 2 along with five or six people. He also confirmed that no Chinese ambassador was present along with Gandhi during his visit. “He was here for one and half hours. Nobody from the Chinese embassy was present with him,” said Shrestha.

రాహుల్ గాంధీ పక్కనుందీ చైనా అంబాసిడర్ కాదు.. మరెవరో తెలుసా.!

Posted: 05/04/2022 01:43 PM IST
Fact check rahul gandhi seen with chinese envoy in nepal baseless rumour spreads like wildfire

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ సభ్యుడు రాహుల్ గాంధీ.. నైట్‌క్ల‌బ్ విజిట్ చేయడంపై దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. ఓ వైపు వేల కోట్ల రూపాయల పవన్ హన్స్ సంస్థను కారుచౌకగా ఆరునెలల క్రితం పురుడు పోసుకున్న కంపెనీకి కట్టబెడుతున్న విషయాన్ని దేశప్రజల దృష్టికి తీసుకురాకుండా బీజేపిసహా దాని మిత్రపక్షాల నేతలు రాహుల్ నైట్ క్లబ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి దాని చుట్టూ రచ్చ చేశారు. కేంద్రంలోని అధికార బీజేపి వేసిన ప్లాన్ ముందు కాంగ్రెస్ నేతలు చిత్తు కావడం.. దేశ ప్రజల దృష్టి కూడా అటువైపు మళ్లడం జరిగింది.

బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్ ఉన్న నైట్‌క్ల‌బ్‌లో ఓ మ‌హిళా ఫ్రెండ్‌తో రాహుల్ ఉన్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ మ్యూజిక్‌కు జ‌నం డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. అయితే రాహుల్ చైనా హనీ ట్రాప్ లో చిక్కుకున్నారా.? అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక బీజేపీ నేతలు మరో అడుగు ముందుకేసీ దేశభద్రతకు సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీని దోషిని చేస్తూ.. చైనా రాయబారి హౌ యాంకీతో ఆయన సన్నిహితంగా వున్నారని కూడా ప్రశ్నించారు. అయితే అసలు అమె ఎవరు.? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశానికి సంబంధించి ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా... ఆమె చైనా రాయబారి హౌ యాంకీ కాదని తేలింది. ఆయన పక్కనున్న మహిళ సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నైట్ క్లబ్ యజమాని వెల్లడించారని పేర్కొంది. క్లబ్ కు రాహుల్ తో పాటు మరో ఐదారుగురు స్నేహితులు వచ్చారని... వీరిలో ఏ ఒక్కరూ చైనీయులు కాదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపింది. దాదాపు గంటన్నర సేపు రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నట్టు పేర్కొంది.

సుమ్నిమా వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వివాహానికి సంబంధించిన విందును పెళ్లికూతురు తరపున నైట్ క్లబ్ లో ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రాహుల్ అక్కడున్న సందర్భంలో తీసిన వీడియో దుమారం రేపింది. అయితే రాహుల్ గాంధీని నైట్ క్లబ్ లో పాల్గోనడం చూసిన బీజేపి ఐటీ సెల్ మాల్వియా.. అదే అదనుగా భావించి ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్నేహితురాలి వివాహానికి వెళ్లడం నేరం కాదు కదా? అని ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles