Will go to Sirisilla again, says KA Paul మళ్లీ సిరిసిల్లకు వెళ్తా.. చంపేస్తారా: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

Will meet dgp on police obstacles will go to sirisilla again praja shanti party president ka paul

TRS activists attacked Praja Shanthi Party president, TRS activists attacked K A Paul, K.A. Paul attacked at Jakkapur village, K.A. Paul attacked at siddipet village, Praja shanti party, K A Paul, TRS Activist, Jakkapur, Siddipet, Farmers, Slap, sircilla police, Telangana, Politics

Christian preacher, Prajashanti Party leader KA Paul alleged that he was attacked by Minister KTR at the borders of Siddipet. He also said that he will visit Siricilla constituency after his meeting in parade grounds. He added that the TRS party would get more than 20 seats in the forthcoming elections. He said that the governor's Tamilisai had condemned the attack on him.

మళ్లీ సిరిసిల్లకు వెళ్తా.. చంపేస్తారా: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

Posted: 05/04/2022 12:42 PM IST
Will meet dgp on police obstacles will go to sirisilla again praja shanti party president ka paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కు సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆయన సిరిసిల్లా పర్యటనకు వెళ్తానని చెప్పడంతో పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. దీంతో ఈయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తనపై దాడి చేసింది మంత్రి కేటీఆర్ మనుషులేనని, స్థానిక సిఐ, డీఎస్సీల సమక్షంలోనే ఇదంతా జరిగినా వారు వేడుక చూస్తుండిపోయారని, ఈ దాడిలో వారికి కూడా తెరవెనుక ప్రమేయముందని ఆయన అరోపించారు.  

అంతేకాకుండా.. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 20 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రపంచ శాంతి దూతగా రాలేదని… ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని.. తెలంగాణలో ఇక కేసీఆర్‌ ఆటలు సాగవని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆగడాలు ఇక ప్రజలు కూడా సహించబోరని అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని అన్నారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని, ఈసారి అరెస్ట్ చేస్తారా? చంపుతారా? అని ప్రశ్నించారు.

ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన బస్వాపూర్ గ్రామ రైతులు పాల్‌ను కలిశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, అది కూడా ఐదు రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ పరిహారమేదో తానే అందిస్తానని పాల్ అన్నారు. ఇక తనపై దాడి గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలియలేదని,   హైదరాబాద్‌లో ఉన్న జడ్జీలు, లాయర్లు అందరూ దీన్ని ఖండిస్తున్నారని, గవర్నర్‌ తమిళిసై తనపై దాడిని ఖండించినట్లు ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles