Spicejet mid-air turbulance: DGCA orders probe స్పైస్ జెట్ విమాన కుదుపులపై డిజీసిఏ విచారణ

Spicejet flight faces severe turbulence during descent several injured

SpiceJet's Mumbai-Durgapur flight, Spice-jet flight faces turbulence, Directorate of Civil Aviation, Mumbai, hospital, Durgapur, SpiceJet plane incident, Durgapur, major mid air turbulence, passengers injured, serious, west Bengal

At least 14 passengers on SpiceJet's Mumbai-Durgapur flight were injured. The SpiceJet flight faced severe turbulence during descent. However, the Boeing B737 aircraft managed to land safely at the Durgapur airport in West Bengal. The injured were given medical assistance and taken to the hospital, said the airline. The Directorate of Civil Aviation (DGCA) said it ordered a regulatory investigation into the incident.

ITEMVIDEOS: స్పైస్ జెట్ విమాన కుదుపులతో గాయాలపాలైన ప్రయాణికులు

Posted: 05/02/2022 01:42 PM IST
Spicejet flight faces severe turbulence during descent several injured

చౌకధర విమానయానాన్ని దేశంలోని ప్రయాణికులకు అందిస్తోన్న స్పైస్ జెట్ సంస్థ‌ గురించి ప్రజలకు తెలిసిందే. అయితే తాజాగా స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి737 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులకు విచిత్రమైన అనుభూతి మిగింది. ఇది కాస్తా హింసాత్మక అనుభవంగానే ప్రయాణికులు అభివర్ణిస్తున్నారు. విమానం గాలిలో ఒక్కసారిగా కుదుపుల‌కు గురికాడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఓ వైపు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రయాణిస్తున్న వీరికి గాయాలయ్యారు. కుదుపుల ధాటికి విమానంలోని 40 మంది ప్రయాణికులకు గాయాల‌య్యాయి. ఇందులో 10 మందికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని, అయితే వారి ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు లేద‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి ప‌శ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు బయల్దేరిన స్పైస్ జెట్ విమానం మార్గమధ్యలో కుదుపులకు గురైంది. దుర్గాపూర్‌కు చేరుకొని, ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి ముందు ఈ కుదుపుల‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. వాతావ‌ర‌ణం స‌రిగ్గా లేక‌పోవ‌డంతోనే ఇలా కుదుపుల‌కు లోనైన‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప‌రిణామంతో ప్ర‌యాణికులంద‌రూ తీవ్ర ఆందోళ‌నకు గుర‌య్యారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు స్పైస్ జెట్ సంస్థ పేర్కొంది. ఇంత భారీ కుదుపుల‌కు కార‌ణాలేంట‌ని అధికారులు విచార‌ణ చేయ‌నున్నారు. మ‌రోవైపు ఈ కుదుపుల కార‌ణంగా ల‌గేజీ క్యాబిన్ త‌లుపులు తెరుచుకున్నాయి. దీంతో ప్ర‌యాణికుల‌పై ల‌గేజీ కూడా ప‌డింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles