Ukraine-based doctor from AP with pet jaguars freed ఇండియాకు వస్తా కానీ..: జాగ్వార్ కుమార్ కండీషన్

Ukraine based doctor from ap with pet jaguars held hostage by russian army freed

Jaguar Kumar, Nehru Zoological Park, Indian government, ministry of external affairs, leopard, black panther. russian army, Ukraine, jaguars, jaguar kumar, giri kumar patil, Tanuki, West Godavari, andhra pradesh, Telangana, animals, Pets, Big cats

Ukraine-based orthopedic doctor of Andhra origin, Dr Giri Kumar Patil, who has two fully grown jaguars as pets, had refused to be airlifted by the Indian government immediately after the Russian invasion began. In the past few weeks, however, he is ready to shift base to India as long as he is given land and allowed access to his cats.

పెంపుడు చిరుతలకు స్థలం కేటాయిస్తేనే ఇండియాకు వస్తా: జాగ్వార్ కుమార్

Posted: 04/30/2022 05:54 PM IST
Ukraine based doctor from ap with pet jaguars held hostage by russian army freed

ఉక్రెయిన్‌లో స్థిరపడిన ఆంధ్రా ఆర్ధోపెడిక్ డాక్టర్‌ గిరికుమార్‌ పాటిల్‌ యుద్ధం మొదలయ్యాక స్వదేశం తిరిగి వచ్చేందుకు నిరాకరించారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఉక్రెయిన్‌లో స్థిరపడిన భారతీయులు, విద్యార్ధుల్ని పెద్ద సంఖ్యలో స్వదేశానికి తరలించారు. అయితే తాను పెంచుకుంటున్న చిరుతలు అనాథలైపోతాయనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పాటిల్ అంగీకరించలేదు. తనతో పాటు చిరుతల్ని కూడా భారత్‌ తరలించేందుకు అంగీకరిస్తేనే వస్తానని మొండికేశారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంతో పాటిల్ మనసు మార్చుకున్నారు. తనతో పాటు చిరుతల్ని తెచ్చుకునేందుకు అనుమతిస్తే భారత్ వస్తానని పాటిల్ చెబుతున్నారు.

ఇటీవల జాగ్వార్‌ కుమార్‌ను రష్యా సైన్యం నిర్భంధించి పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించడంతో మనసు మార్చుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో బయటకు తెలియనివ్వకూడదనే షరతుతో డాక్టర్‌ కుమార్‌ను రష్యా సైన్యం విడిచిపెట్టింది. దీంతో జాగ్వార్ కుమార్ భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. తనతో పాటు చిరుత పులి, నల్లచిరుతల్ని తరలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో వన్యప్రాణుల్ని పెంపుడు జంతువులుగా పెంచుకోడానికి చట్టాలు అనుమతించకపోవడంతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు తరలించడమో, అక్కడ ఉన్న జూలలో కొంత స్థలం కేటాయిస్తే తన పెంపుడు జంతువుల్ని పెంచుకుంటానని విజ్ఞప్తి చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరికుమార్‌ 2007లో వైద్య విద్యాభ్యాసం కోసం ఉక్రెయిన్ వెళ్ళారు. ఆ తర్వాత అక్కడే ప్రభుత్వ వైద్యశాలలో ఆర్ధోపెడిక్ సర్జన్‌గా స్థిరపడ్డారు. గత నెలలో కుమార్‌తో పాటు రెండు చిరుతల్ని ఎయిర్‌లిఫ్ట్‌ చేస్తామని విదేశాంగ శాఖ ఆఫర్ ఇచ్చింది. చిరుత పులుల్ని సొంతంగా పెంచుకునేందుకు అనుమతికి సహకరించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహకారాన్ని కూడా కోరినట్లు డాక్టర్ కుమార్ చెబుతున్నారు. సొంతంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు కుమార్ చెబుతున్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని ఓ బంకరులో తన పెంపుడు జంతువులతో కలిసి తలదాచుకుంటున్న కుమార్‌ను ఇటీవల రష్యా బలగాలు బంధించాయి. యుద్ధ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నాడనే అనుమానంతో నిర్బంధించిన రష్యా బలగాలు చివరకు యుద్ధ సమాచారం బయటకు తెలియనివ్వనని రాతపూర్వకంగా ఇవ్వడంతో విడిచిపెట్టారు. అప్పటి నుంచి తాను ఉంటున్న ప్రదేశం గురించి కూడా బయటకు తెలియకుండా కుమార్ జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల చైనాలో ఉన్న తన మిత్రుడికి వాయిస్ మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో కుమార్‌ను రష్యా బలగాలు నిర్బంధించిన సంగతి వెలుగు చూసింది. ఇంట్లోకి చొరబడిన సైనికులు ఇల్లంతా చిందరవందర చేశారని, దాచుకున్న డబ్బు మొత్తం తీసుకుపోయారని, అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి షూట్ చేస్తామని బెదిరించినట్లు మిత్రుడికి సమాచారం ఇచ్చాడు.

రష్యా సైన్యం బంధించిన సమయంలో తన పెంపుడు జంతువుల కోసమే ఉక్రెయిన్‌లో ఉండిపోయానని, బయట ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని వేడుకున్నానని, వ్లాగ్స్‌ కోసం ఉక్రెయిన్ నగరాల్లో ఎలాంటి వీడియోలు రికార్డ్ చేయడం లేదని సైన్యానికి స్పష్టం చేసినట్లు మిత్రుడిక తెలిపారు. తన యూట్యూబ్ ఛానల్ తనిఖీ చేసుకోవచ్చని, తనను చంపితే తనతో పాటు ఉన్న ఐదు పెంపుడు జంతువులు, రెండు చిరుతలు, మూడు కుక్కలు తిండిలేక చనిపోతాయని వేడుకోవడంతో సైనికులు కరుణించారని చెప్పుకున్నారు. తనను చంపాలని నిర్ణయించుకుంటే చివరిసారి తల్లితో మాట్లాడేందుకు అనుమతించాలని వేడుకోవడంతో సైన్యం అతడిని విడిచిపెట్టినట్లు మిత్రుడికి పంపిన వాయిస్ మెయిల్‌లో వివరించారు. జాగ్వార్‌ కుమార్‌ వినతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles