Ibrahimpatnam ACP Balakrishna Reddy Suspended ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్.!

Ibrahimpatnam real estate firing case acp balakrishna reddy suspended

Ibrahimpatnam ACP Suspended, Ibrahimpatnam ACP Suspended in realtors murder case, Realtors Murder Case Update, Ibrahimpatnam Realtors Murder Case Update, Ibrahimpatnam Realtors Murder Case news, Balakrishna Reddy, Ibrahimpatnam ACP, realtors murder case, DGP Mahender Reddy, Rangareddy, Telangana, Crime

DGP Mahender Reddy issued orders suspending Ibrahimpatnam ACP Balakrishna Reddy. The DGP responded to allegations that ACP had taken money in the realtor murder case. It is known that the matter was attached to the Rachakonda CP office in the past. The DGP was outraged at the continuation of relations with the perpetrators of the crime and issued orders suspending the ACP.

రియల్టర్లపై కాల్పుల ఘటనలో.. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్.!

Posted: 04/23/2022 01:45 PM IST
Ibrahimpatnam real estate firing case acp balakrishna reddy suspended

తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసులో ఓ పోలీసు ఉన్నాతాధికారిపై వేటు పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డిపై పోలీసు ఉన్నాతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నెంగూడ వద్ద గత నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకేసులో ప్రధాన నిందితుడైన మట్టారెడ్డితో పాటు అతనికి సహకరించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈకేసులో మట్టారెడ్డి వర్గానికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డికి పెద్దమొత్తంలోనే డబ్బులు ముట్టజెప్పినట్టు కూడా అరోపణలు ఉన్నాయి. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బదిలీ చేసి అంతర్గత విచారణ చేయించారు. నివేదిక ఆధారంగా ఇవాళ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నవారు శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిలతో ఓ వివాదాస్పద భూమి విషయమై చర్చించేందుకు రమ్మని కబరు రావడంతో వారు కర్ణగూడకు చేరుకున్న సమయానికి వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కలకలం రేపింది. ఈ కాల్పుల్లో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మరణించాగా.. రాఘవేంద్రరెడ్డి వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించగా దుండగులు వెంటాడి ఛాతీపై కాల్చారు. కుప్పకూలిన ఆయన్ను స్థానికులు వనస్థలిపురం బీఎన్​ రెడ్డి నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతున్న ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles