మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసం ఎదుట ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు తన భర్త, బడ్నేరా ఎమ్మెల్యే రవి రానాతో కలిసివచ్చి హనుమాన్ చాలీసా చదువుతాని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, మాజీ టాలీవుడ్ నటి నవనీత్ రాణా సవాల్ చేయడం తొలుత రాజకీయ దుమారాన్ని లేపింది. ఆ తరువాత దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రవి రానా, నవనీత్ రానాల ఇంటి వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఉదయం 9 గంటలకు ఉద్దవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్ చాలిసా చదువుతానని ప్రకటన నేపథ్యంలో నవనీత్ సహా రవి రానా దంపతులకు పోలీసులు ముందస్తు నోటీసులు అందించారు.
శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముంబయిలోని ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటి మరీ నవనీత్ కౌర్ ఇంటికి చేరుకున్న శివసేన కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాత్రోశ్రీ వైపు రానా దంపతులు కన్నెత్తి చూసినా వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శివసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆలోచనలు స్వతహాగా రానా దంపతులకు వచ్చినవి కావని చెబుతన్న శివసేన కార్యకర్తలు.. వారి వెనుక ఏదో ఓ బలమైన రాజకీయ శక్తి ఉండి వారితో ఇలా మాట్లాడిస్తుందని శివసేన కార్యకర్తలు అరోపిస్తున్నారు.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన ఇంటిముందు తన భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్ చాలీసా చదువుతానని నవనీత్ గురువారం ప్రకటించారు. దీంతో ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్దకు శివసేన సైనికులు ఉదయం భారీగా చేరుకున్నారు. 9 గంటలు దాటినా నవనీత్ కౌర్ రాలేదని.. ఆమె ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఠాక్రేకు మద్దతుగా ఆయన నివాసం వద్దకు మహిళలు కూడా తరలివచ్చారు. తాము హనుమాన్ చాలీసా ప్రతులను కూడా తీసుకొచ్చామని, నవనీత్ కౌర్ రాణా వచ్చి దాన్ని పఠించాలని వారు అన్నారు.
#WATCH Shiv Sena workers protest outside the residence of Amravati MP Navneet Rana in Mumbai as the MP plans to chant Hanuman Chalisa along with her husband MLA Ravi Rana outside 'Matoshree' the residence of #Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/OR7CQQpWlk
— ANI (@ANI) April 23, 2022
నవనీత్ రాణా మాత్రం.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మతోశ్రీకి చేరుకుని తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని స్పష్టం చేశారు. తమపైకి సీఎం ఠాక్రేనే శివసేన కార్యకర్తలను పంపించారని ఆరోపించారు. ఆయనకు తనలాంటి వాళ్లను జైలుకు పంపడం తప్ప ఇంకేం తెలియదని ధ్వజమెత్తారు. సీఎం ఠాక్రే నివాసం మాతోశ్రీకి రక్షణ కల్పించేందుకే శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారని ఆ పార్టీ నేత అనిల్ దేశాయ్ తెలిపారు. నవనీత్ రాణా, ఆమె భర్త రాష్ట్రంలో శాంతి భద్రతలను సవాల్ చేస్తున్నారని, వారిని వెనకనుంచి ఎవరో నడిపిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారని చెప్పారు. శివసైనికులు భారీగా రావడం వల్ల ఠాక్రే నివాసంతో పాటు నవనీత్ రాణా ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more