Domestic air passenger crosses 4-lakh mark a day జోరందుకున్న దేశీయ విమాన ప్రయాణాలు.. ఒక్క రోజే 4 లక్షలు..

India s domestic air passenger traffic crosses 4 lakh mark a day

COVID-19 cases, Domestic flights, Jyotiraditya Scindia, Jyotiraditya Scindia on domestic flights, domestic air passengers, domestic air travel, domestic air travellers, domestic air passengers, domestic passengers, Union Civil Aviation Minister Jyotiraditya M. Scindia, domestic flights,, air traffic, civil aviation

For the first time in the past two years, India crossed over 4 lakh daily passengers record on April 18. Union Civil Aviation Minister Jyotiraditya Scindia said, “After COVID-19 era, we have today crossed over 4 lakh daily passengers record. it's a historic day for Civil Aviation Ministry. I have faith that in the coming days we will maintain this record.”

జోరందుకున్న దేశీయ విమాన ప్రయాణాలు.. ఒక్క రోజే 4 లక్షలు..

Posted: 04/19/2022 11:53 PM IST
India s domestic air passenger traffic crosses 4 lakh mark a day

కరోనా మహమ్మారి విజృంభించేందుకు ముందు దేశంలో విమాన ప్రయాణాలకు దేశీయ ప్రయాణికులు ఒకింత ఆసక్తిని కనబర్చారు. కరోనా విజృంభనతో విమాన ప్రయాణాలపై అంక్షలు పెట్టడంతో పలు విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. పలితంగా తమ విమాన సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసుకున్నాయి. అయితే కరోనా మూడు దశలతో మహమ్మారి ఉనికే లేకపోవడంతో దేశంలో మరోమారు విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. దేశీయ విమనాప్రయాణికుల్లో కరోనా భయం సన్నగిల్లడం కూడా దేశీయ విమానయాన ప్రయాణాలకు దోహదం చేస్తోంది.

కరోనా అంక్షల నేపథ్యంలో దాదాపు ఏడాది వరకు 50 శాతం, 75శాతం ఆక్యుపెన్సీతో విమనాలు నడిచే పరిస్థితులు ఇప్పుడు తోలగిపోవడం.. నూటికి నూరు శాతం కెపాసిటీతో విమానాలు నడుస్తున్న నేపథ్యంలో విమానయాన ప్రయాణాలకు కాసింత అందుబాటు దరలోనే విమానయాన సంస్థలు కూడా అందిస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలు మళ్లి జోరందుకున్నాయి. దేశీయ విమాన ప్రయాణాల కోసం ఉత్సాహం కనబరుస్తున్నారు. ఆంక్షల నేపథ్యానికి తోడు అందకుండా పోతున్న విమాన ఇంధన ధరలు కూడా ప్రయాణికులకు కొన్నాళ్ల పాటు విమానయానాన్ని దూరం చేశాయి,

అయితే ప్రజలు వేసవి విహారాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా కాసింత తక్కువ ధరలను ప్రకటిస్తున్న క్రమంలో విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. కరోనాతో 2020 ఏప్రిల్ నుంచి విమాన సర్వీసులపై పెద్ద ఎత్తున ప్రభావం పడడం తెలిసిందే. ఆ తర్వాత కరోనా పలు విడతలుగా విరుచుకుపడింది. దీంతో ఎయిర్ లైన్స్ పరిమిత సర్వీసులనే నడిపించాల్సి వచ్చింది. గత ఆదివారం (ఏప్రిల్ 17) ఒక్కరోజే దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల్లో 4 లక్షల మంది ప్రయాణించారు. కరోనాకు ముందు నాటి రోజువారీ విమాన ప్రయాణికుల్లో ఇది 96 శాతానికి సమానం.

దీంతో ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఉత్సాహం నెలకొంది. అంతకుముందు రెండు వేసవి సీజన్లలో కరోనా రెండు విడతలుగా దేశాన్ని చుట్టేయడం తెలిసిందే. దీంతో ప్రజలు ప్రయాణాలు, పర్యటనలను తగ్గించుకోవడం, వాయిదా వేసుకోవడం చేశారు. ఈ విడత కరోనా కేసులు పెద్దగా లేకపోవడం, లాక్ డౌన్ లు, ఇతర ఆంక్షలన్నీ తొలగిపోవడం, పండుగలు, వరుస సెలవులు అన్నీ కలసి ప్రయాణికుల సంఖ్యను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లాయని చెప్పుకోవాలి. వేసవి సీజన్ వచ్చే ఏడు వారాల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles