SBI hikes lending rate by 10 basis points; EMIs to go up రుణగ్రహితలపై భారాన్ని మోపిన ఎస్బీఐ..

Loans get costlier as banks hike mclr sbi raises mclr by 10 bps

interest rate on loans, State Bank of India, MCLR, HDFC Bank, Punjab National Bank, home loans, sbi interest rates, sbi interest rates home loan, sbi interest rates hikes, sbi loan interest rate, sbi loan interest rate hikes, sbi mclr rate 2021, sbi mclr news, sbi mclr current rate, sbi mclr april 2022, home loan interest rate, home loan emi calculator sbi, home loan interest rate sbi, home loan emi calculator icici, home loan interest rate hdfc

Both consumers and corporates will pay a higher interest rate on loans, with the State Bank of India (SBI) raising the marginal cost of funds based lending rates (MCLR) by 10 basis points (bps) across tenures. This is the first instance of a lending rate hike by SBI in more than three years. The interest rate cycle seems to have turned with other large lenders.

రుణగ్రహితలపై భారాన్ని మోపిన ఎస్బీఐ.. అదే బాటలో అర్బీఐ.?

Posted: 04/20/2022 12:38 AM IST
Loans get costlier as banks hike mclr sbi raises mclr by 10 bps

రుణగ్రహితలపై వడ్డీ భారం పెరగబోతోంది. దేశంలో సామాన్య మధ్యతరగతి వారిపై మరో పిడుగు పడింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అకాశాన్ని అంటుంటే..అటు ఇంధన ధరలు భగ్గున మండుతున్నాయి. ఈ క్రమంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్యాంకు రుణాలతో తమ కోరికలను నెరవేర్చుకుంటున్న క్రమంలో.. ఇక దానిని కూడా అందని ద్రాక్షగానే మర్చేసింది దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన భారతీయ స్టేబ్ బ్యాంకు. తాజాగా ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లను 0.10 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు కూడా ఇకపై ప్రియం కానున్నాయి.

దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు కొంచెం భారం కానున్నాయి. ఇతర బెంచ్ మార్క్ లకు అనుసంధానంగా ఉన్న రుణాలు తీసుకున్న వారికి తాజా రేట్ల పెంపు వర్తించదు. సవరించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ ప్రకటించింది. తాజా సవరణతో ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 7.10 శాతానికి చేరింది. దాదాపు అధిక శాతం రుణాలు ఏడాది కాల ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటుకే లింక్ అయి ఉంటాయి. రెండేళ్ల ఎంసీఎల్ఆర్, ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను కూడా ఎస్బీఐ ఇదే స్థాయిలో పెంచింది. కనుక పెరిగిన రేట్ల మేర ఈఎంఐను పెంచి కట్టాలి. లేదంటే ముందున్న ఈఎంఐనే చెల్లిస్తూ కాల వ్యవధిని పెంచుకోవచ్చు.

ఎస్బీఐ నిర్ణయాన్ని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు అనుసరించనున్నాయి. ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోయిన తరుణంలో ధరల కట్టడికి ఆర్బీఐ కీలక రేట్లను జూన్ నాటి సమీక్షలో పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెపో రేటును ఆర్బీఐ పెంచితే.. అప్పుడు కూడా రుణ రేట్లు మరింత పెరిగేందుకు దారితీస్తుంది. రెపో ఆధారిత రేట్లను కూడా బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. కనుక వేగంగా పెరిగిన రేట్ల భారాన్ని బ్యాంకులు వినియోగదారులకు బదలాయిస్తాయి. వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం కనుక రుణ గ్రహీతలు అదనపు భారానికి సిద్ధ పడక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : interest rate on loans  State Bank of India  MCLR  HDFC Bank  Punjab National Bank  home loans  

Other Articles