Tight security for Hanuman Jayanthi procession in Hyderabad హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్

Liquor shops will be closed amid tight security for hanuman jayanthi procession

CV Anand, Hanuman Shobha Yatra, Hyderabad, Hyderabad traffic restrictions, Hanuman Jayanti, hyderabad police, Traffic restrictions in Hyderabad, Gowliguda, Tadbund, Hyderabad to Secundrabad, Hanuman Vijaya Yatra, Hyderabad, Telangana, Devotional

Elaborate security arrangements have been made for the Hanuman Jayanthi process to be taken out in the city on Saturday. This will be the second religious procession to be taken out in the city in less than a week. The religious procession, which covers a distance of 12 km, will commence from Gowliguda Mandir and end at Tadbund Hanuman Temple.

హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్

Posted: 04/15/2022 08:02 PM IST
Liquor shops will be closed amid tight security for hanuman jayanthi procession

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో చేపట్టనున్న హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకుని జంటనగరాల పరిధిలోని మద్యం విక్రయాలను నిలివేయాలని పోలీసు అధికారులు అదేశాలు జారీచేశారు. జంటనగరాల్లోని అన్ని మద్యం దుకాణాలు, బార్లలతో పాటు స్టార్ హోటళ్లలోనూ మద్యం దుకాణాలను మూసివేయాలని అదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలో హనుమాన్ శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర‌ గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బ‌న్‌లోని హ‌నుమాన్ మందిర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. క‌ర్మ‌న్‌ఘాట్ హ‌నుమాన్ దేవాలయం నుంచి మ‌రో యాత్ర కొనసాగ‌నుంది. క‌ర్మ‌న్‌ఘాట్ నుంచి చంపాపేట్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నారాయ‌ణ‌గూడ మీదుగా తాడ్‌బ‌న్‌లోని హ‌నుమాన్ మందిర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

గౌలిగూడ రామ్ మందిర్ వ‌ద్ద హ‌నుమాన్ శోభాయాత్ర ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. పుత్లిబౌలీ ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్, రామ్ కోఠి ఎక్స్ రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, వైఎంసీఏ, నారాయ‌ణ‌గూడ ఎక్స్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ న‌గ‌ర్ క్రాస్ రోడ్స్, గాంధీ న‌గ‌ర్ టీ జంక్ష‌న్, క‌వాడిగూడ ఎక్స్ రోడ్, సీజీవో ట‌వ‌ర్స్, ఆర్పీ రోడ్, ఓల్డ్ పీఎస్ రామ్‌గోపాల్ పేట్, పార‌డైజ్ జంక్ష‌న్, సీటీవో, బ్రూక్ బాండ్, మ‌స్తాన్ కేఫ్ మీదుగా తాడ్‌బ‌న్ హ‌నుమాన్ మందిర్ వ‌ద్ద‌కు రాత్రి 8 గంట‌ల‌కు చేరుకోనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ మ‌ళ్లించ‌నున్నారు.

దిల్‌సుఖ్ న‌గ‌ర్ నుంచి మెహిదీప‌ట్నం వెళ్లే వాహ‌న‌దారులు ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, తార్నాక‌, సికింద్రాబాద్ లేదా ఎల్బీన‌గ‌ర్, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, ఆరాంఘ‌ర్, అత్తాపూర్ మీదుగా మెహిదీప‌ట్నం చేరుకోవ‌చ్చు. ల‌క్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేష‌న్ లేదా ఉప్ప‌ల్ వెళ్లే వాహ‌న‌దారులు.. వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ‌, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లై ఓవ‌ర్, ప్ర‌కాశ్ న‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్, పార‌డైస్ ఫ్లై ఓవ‌ర్ మీదుగా సికింద్రాబాద్, ఉప్ప‌ల్ చేరుకోవ‌చ్చు. హునుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles