Smartphone Catches Fire Mid-Air on IndiGo Flight కలకలం: గగనతలంలో విమానం.. పేలిన ప్రయాణికుడి సెల్ ఫోన్..

Passenger s phone catches fire mid air on indigo flight after battery overheats

phone catches fire, mobile phone, Indigo flight, Delhi bound flight, Dibrugarh, Assam, crew members, battery, overheating, DGCA, aviation news

A passenger’s mobile phone caught fire mid-air during an IndiGo flight from Dibrugarh to Delhi on April 14. A cabin crew member noticed the sparks and smoke emitting from the phone and doused the fire immediately using an extinguisher. No injuries were reported in the incident. As per a statement by the DGCA, the phone caught fire due to an abnormal overheating issue with the battery.

కలకలం: గగనతలంలో విమానం.. పేలిన ప్రయాణికుడి సెల్ ఫోన్..

Posted: 04/15/2022 06:53 PM IST
Passenger s phone catches fire mid air on indigo flight after battery overheats

ఇండిగో విమానంలో అనుకోని ఘటన చేటుచేసుకుని ప్యాసింజర్లలో కొద్దిపాటు కలవరానికి కారణమైంది. అనూహ్యపరిణామంతో విమానంలోని ప్యాసింజర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. విమానం గగనతంలో ఉండగా ఒక ప్రయాణికుడి మొబైల్‌ ఫోన్‌ హఠాత్తుగా పేలిపోయింది. దీంతో ఫోన్ నుంచి ఒక్కసారిగా నుంచి పొగలు, మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఫ్లైట్‌ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇండిగో యాజమాన్యం కూడా ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

అస్సాంలోని  డిబ్రూఘర్ నుంచి దేశరాజధాని ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సంఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో విమానం 6ఈ 2037 అస్సాంలోని దిబ్రూఘడ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడి మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్ పెట్టాడు. అది కాస్తా ఓవర్ హీట్ కావడంతో దాని నుంచి పొగలు, నిప్పురవ్వలు రావడాన్ని క్యాబిన్‌ క్రూ సిబ్బంది గమనించారు. వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో ఆ విమానం గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది.

కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు లేదా క్రూ సిబ్బందికి ఏమీ జరుగలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. మరోవైపు ఇండిగో విమాన సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘దిబ్రూఘ‌డ్‌-ఢిల్లీ 6ఈ 2037 విమానంలో మొబైల్ ఫోన్‌ బ్యాటరీ అసాధారణంగా వేడెక్కిన సంఘటన జరిగింది. అన్ని ప్రమాదకర సంఘటనలను నివారించడానికి శిక్షణ పొందిన సిబ్బంది పరిస్థితిని చాలా త్వరగా చక్కదిద్దారు. విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది లేదా ఆస్తికి ఎలాంటి హానీ జరుగలేదు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles