More on two-wheelers without number plates! నెంబరు ప్లేట్ లేకపోయినా.. కనిపించకుండా చేసినా.. చీటింగ్ కేసు.!

Hyderabad police book cheating case on vehicle without number plates

vehicles without number plates, two wheelers without number plates, stickers on number plates, mask on number plates, two wheelers Traffic violations, vehicles with number plates hidden, vehicles, traffic violations, traffic police, number plates, numbers hidden plates, stickers, masks, cheating case, Hyderabad police, Telangana

It is not just new two-wheelers that run sans registration number plates but even many old vehicles are also being used on city roads by removing either front or rear number plate to escape from the traffic violations. While some have removed the number plates, many others used very small sized letters, some times not legible also while writing the registration number on the plates.

నెంబరు ప్లేట్ లేకపోయినా.. కనిపించకుండా చేసినా.. చీటింగ్ కేసు.!

Posted: 04/14/2022 09:00 PM IST
Hyderabad police book cheating case on vehicle without number plates

నగరంలో ట్రాఫిక్‌ పోలీసుల చలాన్ల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు అనేకానేక ఎత్తులు వేస్తున్నారు. అయితే దొరికనంత వరకే వీరి ఆటలు సాగనున్నాయి. ఒక్కసారి దొరికారా.. ఇక మీ పప్పులు ఉడకవు. అప్పుడు చాలానాలు కాదు ఏకంగా కేసు నమోదవుతుంది. కోర్టు వరకు వ్యవహారం వెళ్లి ఊచలు కూడా లెక్కబెట్టాల్సిందే. ట్రాపిక్ రూల్స్  ఉల్లంఘనలకు పాల్పడతాం.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటామంటూ యువత వేస్తున్న ఎత్తులకు పోలీసులు కూడా పైఎత్తు వేస్తున్నారు. యువత ధోరణిలో మార్పు వచ్చేంత వరకు తాము కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నాయి పోలీసు వర్గాలు.

తాము ట్రాపిక్ నిబంధనలను అతిక్రమించిన సమయంలో అక్కడ ఉండే పోలీసులకు తమ వాహనాలు నెంబర్ ప్లేట్ కనబడకుండా యువత ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు. కోందరు నెంబరులో ఒక అంకెను కనిపించకుండా చేస్తే.. మరికొందరు నెంబర్ ప్లేట్ లకు కరోనా మాస్క్ లను తగిలిస్తున్నారు. ఇంకోందరు ఏకంగా నెంబలర్ ప్లేట్ తొలగిస్తున్నారు. అంటే ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తామని తమ వాహనాల నెంబర్ ప్లేట్ లను తొలగించి మారీ.. తమను పట్టుకోవాలంటూ ట్రాపిక్ పోలీసులకు వాహనదారులు చాలెంజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ధోరణి యువతలో అత్యధికంగా కనిపిస్తోంది.

ఇలాంటి వాహనదారులపై పోలీసులు కూడా కొరడా ఝుళిపించేందుకు సిద్దం అవుతున్నారు. నెంబర్‌ ప్లేట్‌పై మాస్క్‌ కప్పడం, ఒక నెంబర్‌పై బ్లాక్‌ స్టిక్కర్‌ను తగిలించడం, నెంబర్ ప్లేట్ పూర్తిగా తొలగించడం వంటి చర్యలకు పాల్పడిన వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏకంగా వాహనదారులను స్థానిక పోలిస్ స్టేషన్ లలో అప్పగించి వారిపై లా అండ్ ఆర్టర్ పోలీసుల చేత చీటింగ్ కేసు నమోదు చేయిస్తున్నారు. ఈ నెల 12న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ శాంతి కుమార్‌ తాజ్‌కృష్ణా చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా టీఎస్‌ 09 ఈవై 4858 నెంబర్‌ బజాజ్‌ పల్సర్‌పై ఓ వాహనదారుడు వెళ్తుండగా ఆపారు.

వాహన నెంబర్‌ ప్లేట్‌పై మాస్క్‌ కప్పడమే కాకుండా ఓ నెంబర్‌పై బ్లాక్‌ స్టిక్కర్‌ తగిలించడంతో ఇదేమిటని ప్రశ్నించాడు. తాను ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపర్‌ చేసినట్లు వాహనదారుడు వెల్లడించాడు. ఈ వాహనంపై పోలీసులు ఆరా తీయగా జియాగూడ దుర్గానగర్‌ కాలనీకి చెందిన కరన్‌ కోట్‌ నాగేకర్‌ సందీప్‌గా గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వాహనాలను నగరంలో అనేకం ఉన్నాయని పోలీసుల దృష్టికి రావడంతో వాటిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.

నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తూ.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనదారులపై సివిల్ పోలీసుల చేత క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నారు. ఇక దీనికి తోడు నగరవాసులు తమ చేరువలో, ఇరుగు పోరుగున నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, లేక నెంబరుకు స్టిక్కర్ అతికించడం, లేద మాస్క్ కప్పి ఉంచడం.. సహా ఏదేని విధంగా వాహనాల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేసినా.. అట్టి వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరేందుకు ఉపయుక్తులవుతున్నారు. దీంతో నెంబర్ ప్లేట్ లేని వాహనాల గుట్టు మొత్తానికి రట్టు కానుంది. అంతేకాదు వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదుచేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles