"Was Beaten, Locked In Bathroom By My Mother": Son To SC ‘‘అమ్మతో ఉంటే అమె పెట్టిన భాదలే గుర్తుకోస్తాయి’’

I was beaten up and locked in bathroom by my mother son recounts traumatic childhood in sc

Supreme court, mother beats son, Child Abuse, Advocate Archana Pathak Dave, Justice DY Chandrachud, Justice Surya Kant, matrimonial dispute, traumatic childhood, Crime

"I was beaten up. I was locked in the bathroom for hours. I don't want to speak to my mother," a young man told the Supreme Court on Monday while recollecting his "traumatic childhood" even as his estranged parents are locked in a divorce battle for two decades.

అమ్మతో ఉండలేను..ఆమె పెట్టిన బాధలే గుర్తుకోస్తాయి: సుప్రీంకోర్టుకు యువకుడి పిర్యాదు

Posted: 04/12/2022 09:47 PM IST
I was beaten up and locked in bathroom by my mother son recounts traumatic childhood in sc

అమ్మంటే.. నవమాసాలు కడుపులో చల్లంగ కాపాడి.. భూమ్మీద పడిన బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని ప్రేమ పంచే దేవత. అలాంటి దేవత గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఎంత మంది కవులు, ఎన్నో రకాలుగా వర్ణించినా అది తక్కువే. అయితే అమ్మ బిడ్డను ఓ దెబ్బ కొట్టాల్సి వచ్చినా.. మందలించాల్సి వచ్చినా అది అతని బంగారు భవిష్యత్తులో భాగంగానే. ఇటీవల తెలంగాణలోని ఓ తల్లి తన బిడ్డ గంజాయికి అలవాటు పడ్డాడని స్థంబానికి కట్టేసి కళ్లలో కారం పెట్టిన.. ఇకపై గంజాయి తాగను అని మాట ఇచ్చిన తరువాత కానీ ముఖంపై నీళ్లు పోయలేదు. ఇది వక్రమార్గం పట్టిన పిల్లలను దారి తెచ్చుకునేందుకు తల్లి చేసే ప్రయత్నమే.

అయితే ఓ అమ్మ మాత్రం తన కొడుకు పట్ల రాక్షసిగా మారిపోయింది. చిత్రహింసలు పెట్టింది. అవును, స్వయంగా ఆ కొడుకే సుప్రీంకోర్టు గడపతొక్కి తనకు జరిగిన ఘటనలను పూసగుచ్చినట్టు వివరించాడు. అమ్మ తనను విపరీతంగా కొట్టేదని, బాత్రూంలో బంధించేదని చెప్పాడు. తనకు అమ్మతో మాట్లాడడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. ఆమెతో తాను మాట్లాడితే చిన్ననాటి ఆ బాధలు తన కళ్లముందు కదలాడుతున్నాయని ఏకంగా దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తన తండ్రి ఇప్పటివరకు తనపై కనీసం చేయి కూడా చేసుకోసులేదని అన్నాడు.

తన తల్లిదండ్రుల విడాకుల కేసులో న్యాయస్థానం ఎదుట తన అభిప్రాయం చెప్పేందుకు హాజరైన యువకుడు ఈ విధంగా తన అవేదనను వెళ్లగక్కాడు. తన తల్లిదండ్రులు ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్నారని, రెండు దశాబ్దాలుగా విడాకుల కోసం కొట్లాడుకుంటున్నారని, తన బాల్యంలో అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యానని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్ ల ధర్మాసనం ముందుకు వచ్చిన విడాకుల కేసు విచారణ సందర్భంగా ఆ యువకుడు తన బాధనంతా వెళ్లగక్కాడు. అయితే, అమ్మతో మాట్లాడాలంటూ జడ్జిలు ఆ యువకుడిని దాదాపు 45 నిమిషాల పాటు బుజ్జగించే ప్రయత్నం చేసినా.. అతడు ససేమిరా అన్నాడు.

తండ్రితో ఉంటున్న అబ్బాయితో మాట్లాడేందుకు అవకాశం ఇప్పించాల్సిందిగా యువకుడి తల్లి తరఫు లాయర్.. కోర్టును కోరారు. అందుకు స్పందించిన జస్టిస్ చంద్రచూడ్.. మాట్లాడాలంటూ సూచించారు. అయితే, 27 ఏళ్ల ఆ యువకుడు తనకు చిన్నప్పుడు జరిగిన సంఘటనలను కోర్టు కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఏడేళ్ల వయసున్నప్పుడు తనను తీవ్రంగా కొట్టేదని, బాత్రూంలో పడేసి తాళం వేసేదని గుర్తు చేసుకున్నాడు. అమ్మతో మాట్లాడినప్పుడల్లా ఆ గడ్డు పరిస్థితులు గుర్తుకొచ్చేవన్నాడు. ఇకపై ఆమెతో మాట్లాడడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. ఏడేళ్ల కొడుకుపై ఏ తల్లి అంత టార్చర్ పెడుతుందని ప్రశ్నించాడు. తన తండ్రి ఇప్పటివరకు తనపై చెయ్యెత్తి ఎరుగడన్నాడు.

తల్లి తరఫు న్యాయవాది మాత్రం అవన్నీ కట్టుకథలని, అలాంటివేవీ జరగలేదని వాదించారు. అయితే, యువకుడేం చిన్నపిల్లాడుకాదని, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే విజ్ఞత వచ్చిన వయస్కుడేనని కోర్టు చెప్పింది. యువకుడి తండ్రి తరఫు వాదించిన అడ్వొకేట్ అర్చనా పాఠక్ దవే.. అసలు కన్న కొడుకు కస్టడీ కోసం ఏనాడూ ఆ తల్లి కోర్టుకొచ్చిన సందర్భాలు లేవని చెప్పారు. యువకుడి తండ్రి ఎలాంటి గొడవల్లేకుండా ప్రశాంతంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, వీలైనంత త్వరగా విడాకులను మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఆ వాదనలను తల్లి తరఫు లాయర్ కొట్టిపారేశారు. విడిపోయి ఒంటరిగా బతకడం తన క్లయింట్ కు ఇష్టం లేదని, విడాకులు ఇవ్వవద్దని కోరారు. కాగా, 1988లో ఆ ఇద్దరు దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2002 నుంచి విడాకుల కోసం దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme court  mother beats son  Child Abuse  matrimonial dispute  traumatic childhood  Crime  

Other Articles