After 12 years, the youth returned from Pakistan's jail పాకిస్థాన్ జైల్లో భారతీయుడు.. పుష్కరకాలం తరువాత విడుదల..

After 12 years the youth returned from pakistan s jail

Chhavi Mushar, Pakistan Jail, Buxar, Khilagatpur, Anita Kumari, Mother, Brother, maternal grandmother, National Politics

Chhavi Mushar of Buxar’s Khilafatpur village returned home from Pakistan on Tuesday after 12 years. On seeing the son, the mother started crying furiously. Sometimes she would caress his face with her lap and sometimes wiped the tears coming out of her eyes. The elder brother also hugged and started crying loudly.

పాకిస్థాన్ జైల్లో భారత యువకుడు.. పుష్కరకాలం తరువాత విడుదల..

Posted: 04/12/2022 09:00 PM IST
After 12 years the youth returned from pakistan s jail

చనిపోయాడనుకున్న కుటుంబ సభ్యుడు పుష్కర కాలం తరువాత తిరిగి ఇంటికి చేరుకుంటే.. ఆ కుటుంబసభ్యుల స్పందన ఎలా ఉంటుంది.? ఇక తాను ఇంటికి వెళ్లగానే చూడాలని అనుకున్న వ్యక్తి.. ఈ పన్నెండేళ్ల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కుటుంబం నుంచి విడిపోయా.. వేరే కుటుంబంతో కలిస్తే.. తిరిగి ఇంటికి చేరుకున్న వ్యక్తి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఆనందాన్ని బాధను అనుభవిస్తోంది బిహార్​లోని ఓ కుటుంబం. 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలుసుకుని సంతోషంలో మునిగితేలుతోంది. త్వరలోనే ఇంటికి రాబోతున్న అతడి కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తోంది.

అయితే తాను ఇంటికి వెళ్లి ముందుగా ఎవరిని చూస్తారన్న ప్రశ్నకు తన జీవిత భాగస్వామిని అని సమాధానం ఇచ్చిన వ్యక్తికి తన భార్య కుటుంభం నుంచి విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న వార్త తెలిసి బాధలోకి జారుకున్నాడు 12 ఏళ్ల తరువాత ఇంటికి చేరిన వ్యక్తి. అసలు ఈ 12 ఏళ్లు ఆయన ఎక్కడికి వెళ్లాడు. ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. గత 12 ఏళ్లుగా ఆ పాకిస్థాన్​లోని ఓ జైలులో సదరు వ్యక్తి శిక్ష అనుభవించాడు. బిహార్​ వాసి ఛవీ ముషార్​ పాకిస్థాన్ ఎందుకు వెళ్లాడు అంటే.. బిహార్ లోని బక్సర్ జిల్లాకు చెందిన ఈ యువకుడికి మతి కొంత స్థిమితంగా లేదు.

దీంతో తాను తన అత్తగారింటికి వెళ్తున్నానని చెప్పిన సదరు వ్యక్తి అక్కడికి వెళ్లలేదు. సరికాగా.. ఇంటికి కూడా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు అతని కోసం తీవ్రంగా అన్వేషించి పోలీసులకు కూడా పిర్యాదు చేశారు. అయితే గతంలోనే ఇలా అనేక పర్యాయాలు ఇంట్లోంచి మతి స్థిమితం లేని కారణంగా వెళ్లిన వ్యక్తి రెండుమూడు రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకునేవాడు. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 12 సంవత్సరాల పాటు ఇంటికి తిరిగిరాలేదు. అందుకు కారణం ఆయన దారితప్పి పాకిస్థాన్​ సరిహద్దులోకి వెళ్లిపోయాడు. దీంతో పాక్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని కరాచీ జైల్లో పెట్టారు. గతేడాది డిసెంబరులో ఛవీ గురించి సమాచారం అందుకున్న భారత విదేశాంగ శాఖ.. స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది.

ఛవీ ముషార్ బతికే ఉన్నాడని తెలియని కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. అయితే.. ఇప్పుడు తమ కుమారుడు బతికే ఉన్నాడు, అతి త్వరలో ఇంటికి రానున్నాడని తెలిసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ బిడ్డను చూస్తానా అని ఆసక్తిగా ఛవీ ముషార్ తల్లి ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఛవీ ముషార్​.. పాకిస్థాన్​ జైలు నుంచి విడుదలై పంజాబ్​లోని గురుదాస్​పుర్ సరిహద్దులో ఉన్నాడు. అతనిని తీసుకురావడానికి బక్సార్ పోలీసు బృందం గురుదాస్​పుర్​కు వెళ్లింది. ఛవీ ముషార్ తప్పిపోయినప్పటికే ఆయనకు బిందు అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఛవీ చనిపోయాడని ఆయన భార్య వేరొకరిని పెళ్లి చేసుకొని అత్త వారింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం వీరి బిడ్డను ఛవీ ముషార్ సోదరుడు పెంచుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles