Deoghar ropeway accident: Rescue op concludes, 3 die కేబుల్ కార్ల ఘటనలో ముగిసిన సహాయక చర్యలు..ముగ్గురు మృతి..

Deoghar ropeway accident rescue operation ends after 46 hours three dead

Ropeway, Jharkhand, Cable Cars, Jharkhand Accident, Jharkhand Ropeway, Deoghar Accident, Deoghar Ropeway Accident, Jharkhand Ropeway Accident, Jharkhand Accident rescue operations, Jharkhand ropeway rescue operations, Jharkhand Cable Car Accident, ropeway accident, cable car accident, rescue operations, Air force operations, indian air force, Trikut hills, deoghar, jharkhand, crime

Following a two-day-long rescue operation, all but three tourists trapped in cable cars in Jharkhand's Deoghar were successfully evacuated by authorities on Tuesday. One tourist died in the accident while two fell off the helicopters during the extremely challenging rescue operation.

ముగిసిన సహాయక చర్యలు.. ముగ్గురు మృతి.. 46 గంటలు పాటు రోప్-వే పై బాధితులు..

Posted: 04/12/2022 04:22 PM IST
Deoghar ropeway accident rescue operation ends after 46 hours three dead

ఆదివారం రోజున శ్రీరామనవమి పర్వదినం రోజున పర్యాటక ప్రాంతాలకు వెళ్లి.. యాజమాన్యం నిర్లక్ష్యంతో కేబుల్ కార్లు ఒకదానికి మరోకటి ఢీకొనడంతో దాదాపుగా 46 గంటలుగా నింగికి నేలకు మధ్య గాల్లోనే గడిపిన బాధితులకు ఎట్టకేలకు సురక్షితంగా కిందకు చేరుకున్నారు. 46 గంటలుగా బిక్కుబిక్కుమంటూ.. తమకు సాయం చేసే అపన్నహస్తం కోసం ఎదురుచూసిన తరుణంలో చివరకు భారత వాయుసేన రంగంలోకి దిగి కేబుల్ కార్లలో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా కిందకు తీసుకువచ్చింది. దీంతో మొత్తానికి గత 28 గంటలుగా కోనసాగిన సహాయక చర్యలు ఎట్టకేలకు ముగిసాయి.

జార్ఖండ్‌లోని దేవ్ గఢ్ జిల్లాలో.. ప్రపంచవ్యాప్తంగా వున్న ద్వాదశ జోతిర్లింగాలలో ఒకటైన బాబా బైధన్యాధ్ దేవాలయానికి సమీపంలోని త్రికూట పర్వతాలలో, ఆ రాష్ట్ర పర్యాటకశాఖ రోవ్ వేను ఏర్పాటుచేసింది. అయితే ఈ రోప్ వే లోని రెండు కేబుల్ కార్లు ఒకదానికోకటి ఢీకోన్నాయి. ఈఘటనలో పర్యాటకుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, 12 క్యాబిన్లలోని ఏకంగా 60 మంది పర్యాటకులు ఘటన జరిగి ఆదివారం సాయంత్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం దాటేంత వరకు బాధితులు గాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఇవాళ సహాయచర్యలు జరుగుతుండగా, ఇద్దరు పట్టుతప్పి కిందకు జారి పడిపోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది.

మరో ఇద్దరు పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ 40 గంటలుగా కొనసాగుతోంది. రెండు హెలికాఫ్టర్లు, సైనికులు చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్య్యూ ఆపరేషన్‌లో కలిసి పనిచేస్తున్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles