AP New Ministers In Jagan Reddy's Cabinet get Portfolios ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. వారి శాఖల వివరాలివిగో.!

Ap new ministers in jagan reddy s cabinet get portfolios

andhra pradesh cabinet, jagan mohan reddy, ministers, protfolios, five deputy CMs, Andhra Pradesh Cabinet Expansion, AP ministers, swearing-in ceremony, Biswabhushan Harichandan, Velagapudi, Sameer Sharma, YS jagan Mohan Reddy, Andhra Pradesh, Politics

The Andhra Pradesh ministers who sworn-in today as minister got the portfolios today within hours after the swearing in ceremony took place today. CM YS Jagan had once again gave Deputy CM positions to five seniors.

ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. వారి శాఖల వివరాలివిగో.!

Posted: 04/11/2022 04:03 PM IST
Ap new ministers in jagan reddy s cabinet get portfolios

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువు తీరిన కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది. ఇవాళ ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖమంత్రి అంజాద్ బాషా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి బైడి ముత్యాలనాయుడు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణకు, ఎక్సైజ్ శాఖమంత్రి నారాయణస్వామికి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజన్నదొరకు కూడా డిప్యూటీ సీఎం పదవిని కల్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లోకి 14 మంది అవకాశం కల్పించగా, పాత క్యాబినెట్ నుంచి 11 మందిని రెండో క్యాబినెట్ లోనూ మంత్రులుగా కొనసాగించారు.  ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. వీరిలో అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌, సీదిరి అప్పలరాజు, తానేటి వనితలు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌
దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌
గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ
గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ
కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ
కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి :  ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)
ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ
మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ
రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles