Man held for stealing petrol from parked vehicles వాహనాల నుంచి పెట్రోల్ చోరీ.. వ్యక్తి అరెస్ట్

Man held for stealing petrol from parked vehicles at railway station

bhongir railway station, Bhongir railway parking, bhongir railway station vehicle parking, bhongir railway station vehicle parking contractor, bhongir railway station vehicle parking contractor Hemanth reddy, bhongir railway station vehicle parking contractor brother sravan reddy, railway vehicle parking contractor steal petrol from vehicles, bhongir railway station, vehicle parking, Hemanth reddy, sravan reddy, petrol, stealing, Bhongir police, Yadadri, Telangana, Crime

Shravan Reddy, younger brother of a vehicle parking contractor Hemanth Reddy, was arrested by the Bhongir town police for stealing petrol from vehicles parked at the railway station and charging high parking fees. While Sravan reddy petrol stealing from the two wheelers has gone viral on social media.

ITEMVIDEOS: ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ చోరీ.. కాంట్రాక్టర్ సోదరుడి అరెస్ట్

Posted: 04/11/2022 05:21 PM IST
Man held for stealing petrol from parked vehicles at railway station

కంచే చేసు మేసిందన్న చందంగా రైల్వే స్టేషన్ లో పార్క్ చేసిన వాహనాల తిరిగి వాహన యజమానులు తీసుకెళ్లే వరకు భద్రంగా చూసుకోవాల్సిన వ్యక్తే పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ దొంగలించి అడ్డంగా బుక్కయ్యారు. అంతేకాదు తన నోటి దురుసుతో పెట్రోల్ ఎందుకు తీస్తున్నావ్ అన్న కానిస్టేబుల్ కు ఎదరుతిరగి.. తనకు పెట్రోల్ తీసే హక్కు వుందని వాదించాడు. అంతటితో ఆగని సదరు వ్యక్తి.. రూ.12 లక్షలు ఇచ్చి కాంట్రాక్టు మీరే తీసుకోండి.. మేం వెళ్లిపోతం అని చెప్పడం గమనార్హం. ఇందుక సంబంధించిన వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భువనగిరి రైల్వేస్టేషన్ అధికారులు, వాహనదారుల పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తి భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ కాంట్రాక్టు పోందిన హేమంత్ రెడ్డి తమ్ముడు శ్రావణ్ రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్​ కాంట్రాక్టును హేమంత్ రెడ్డి అనే వ్యక్తి పోందారు. అయితే అతని సోదరుడు శ్రావణ్ రెడ్డికి దాని నిర్వహణా బాధ్యతలను అప్పజెప్పారు.

కాగా శ్రావణ్ రెడ్డి ఎన్నాళ్లుగానే అక్కడ పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ తీస్తున్నాడు. యధావిధంగా శనివారం రాత్రి కూడా అక్కడ పార్క్ చేసిన వాహనాల నుంచ పెట్రోల్ తీస్తుండగా చూసిన కొందరు స్థానికి కానిస్టేబుల్ కు పిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ తన సెల్ పోన్ లో రికార్డింగ్ అప్షన్ అన్ చేసి.. శ్రావణ్ రెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు పెట్రోల్ తీస్తున్నావ్ అని విచారించాడు. దీంతో ఎస్ఐ మేడమే తనను పెట్రోల్ తీయమనిందని.. మొదట బుకాయించిన అతను.. ఆ తరువాత కానిస్టేబుల్ పదే పదే ఎవరు అని ప్రశ్నించగా.. మాటమార్చిన శ్రావణ్ రెడ్డి తనకు పెట్రోల్ తీసే రైట్స్ ఉన్నాయని చెప్పాడు.

తాను రైల్వే పార్కింగ్ కాంట్రాక్టును రూ.12 లక్షలకు తీసుకున్నానని, డబ్బులు రావడం లేదని.. దాంతోనే ఈ పనిచేస్తున్నానని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు కానిస్టేబుల్ ను రూ.12 లక్షలు ఇచ్చి ఈ కాంట్రాక్టు తీసుకుని నడిపించుకోవాలని కూడా సూచనలు కూడా చేశాడు. అయితే ఇదంతా సౌమ్యంగా కాకుండా ఇద్దరి మధ్య సంబాషణ దురుసుగా సాగింది. కాంట్రాక్ట్​ తీసుకున్నామని... పెట్రోల్ తీయడం తమ హక్కని... ఏం చేసుకుంటావో చేస్కో అంటూ వాగ్వాదానికి దిగాడు. ఇదిగో ఇక్కడ ఈ బండిలో తీశా.. అక్కడ ఆ బండిలో తీశా.. తీసుకో ఫోటోలు, వీడియోలు తీసుకో.. అంటూ బదులిచ్చాడు. అంతేకాదు.. సర్ మీరిక్కడ కొత్తగా జాబ్​ చేస్తున్నారు. నాకు ఎట్ల పైసల్ వస్తాయి.' అంటూ ఎదురు ప్రశ్నించాడు.

తానే పెట్రోల్ తీస్తున్నానంటూ.. తాను చేస్తున్న పనితో అడ్డంగా దోరికిన తరువాత కూడా దానిని సమర్థించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ తీసుకొమ్మని మీకు బాండ్ రాసిచ్చారా అని కానిస్టేబుల్​ ప్రశ్నిస్తే... కాంట్రాక్ట్​కు 12 లక్షలు కట్టు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. తాము కాంట్రాక్ట్​ వదిలేస్తామని మీరు చూసుకోండి అని అన్నాడు. 'బ్రదర్ మీరు ఓవర్​గా రియాక్ట్​ అవుతున్నారు. కొత్తగా జాబ్​లో ఎక్కినట్లు ఉన్నారు. నువ్వు ఏం చేసుకుంటావో చేస్కో. మీలాంటోళ్లను మస్త్​ మందిని చూశా.' అంటూ కానిస్టేబుల్​తో శ్రవణ్​ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. రైల్వే పోలీసులు, స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు... స్థానిక పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల నుంచి పెట్రోల్ కానీ.. లేక ఎలాంటి దొంగతనాలు జరగకుండా భద్రంగా కాపాడేందుకు వాహనాల పార్కింగ్ తీసుకుని.. వారే స్వయంగా దొంగతనానికి పాల్పడితే ఎలా అంటూ వాహనాదారులు వాపోతున్నారు. వాహన పార్కింగ్ కాంట్రాక్టర్ హేమంత్ రెడ్డి, అతని సోదరుడు శ్రవణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. హేమంత్ర రెడ్డి నుంచి భువనగిరి వాహన కాంట్రాక్టును తక్షణం రైల్వే అధికారులు రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles