AP governor administers oath to new cabinet ministers ఏపీ నూతన క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తి

14 new ministers in jagan reddy s cabinet after revamp 11 from 1st team

andhra pradesh cabinet, jagan mohan reddy, Andhra Pradesh Cabinet Expansion, AP ministers, swearing-in ceremony, Biswabhushan Harichandan, Velagapudi, Sameer Sharma, YS jagan Mohan Reddy, Andhra Pradesh, Politics

The swearing-in ceremony of the AP ministers was held grandly in Velagapudi. Governor Biswabhushan Harichandan administered oath to the the new ministers. CS Sameer Sharma read out the names of the ministers in alphabetical order who were sworn in. Chief Minister Y S Jagan Mohan Reddy on Monday reconstituted the state Cabinet, inducting 14 new faces and re-inducting 11 from his first team.

ఏపీ నూతన క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తి

Posted: 04/11/2022 01:39 PM IST
14 new ministers in jagan reddy s cabinet after revamp 11 from 1st team

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇటీవల పాత మంత్రులందూ తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ క్యాబినెల్ మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. కాగా పాతవారిలో కొందరిని మంత్రివర్గంలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వెఎస్ జగన్ కొత్తగా 25 మందికి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. వీరిలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం. కాగా, ఇవాళ తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా సిద్దం చేసిన వేదికపై మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

ముందుస్తుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.31 గంటలకు మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉన్న 11 మంది మంత్రులను స్థానాలను పధిలం చేసిన ముఖ్యమంత్రి.. కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. కొత్తగా మంత్రిబాధ్యతలను చేపట్టినవారిలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు.

పాత మంత్రివర్గంతో పాటు మరోమారు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నావారిలో విజయనగరం జిల్లా చిపురుపల్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే నారాయణ స్వామి, కడప జిల్లా కడప అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్ పాషా, విజయనగరం జిల్లా పలాసకు చెందిన ఎమ్మెల్యే సీదిరి అలప్పలరాజు, నంద్యాల జిల్లా డోన్కు చెందిన ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్, కొనసీమ జిల్లా రామచంద్రాపురంకు చెందిన ఎమ్మెల్యే చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొనసీమ జిల్లా అమలాపురంకు చెందిన ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఎమ్మెల్యే తానేటి వనిత, కర్నూలు జిల్లా అలూరుకు చెందిన ఎమ్మెల్యే గుమ్మనూరి జయరామ్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన అదిమూలపు సురేష్ లు ఉన్నారు.

ఇక కొత్తగా ఏపీ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నవారిలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంకు చెందిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు, పార్వతిపురం మాన్యం జిల్లా సాలూరుకు చెందిన ఎమ్మెల్యే  రాజన్నదొర, అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంకు చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్, అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, కాకినాడ జిల్లాకు చెందిన తునికి చెందిన ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, కృష్ణా జిల్లా పెడనకు చెందిన జోగి రమేష్, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన ఎమ్మెల్యే  మేరుగ నాగార్జున, పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్యే విడుదల రజని, నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, తిరుపతి జిల్లా నగరికి చెందిన ఎమ్మెల్యే అర్కే రోజా, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన ఎమ్మెల్యే  ఉషశ్రీ చరణ్ లు ఉన్నారు.

మంత్రులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో కొత్త క్యాబినెట్ ఫొటోలు దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఇచ్చారు. కాగా, కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపించిన వెంటనే.. గవర్నర్‌ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు 24 మంది మంత్రుల శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles