గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం వద్ద కలలకం చెలరేగింది. భక్తులకు తేనీరు, అల్పాహారం తయారు చేయడంతో పాటు అన్నదానానికి భోజనాన్ని కూడా సిద్దం చేసేలా ఒప్పందం చేసుకుని శివాలయంలోని క్యాంటీన్ తీసుకున్న కాంట్రాక్టర్.. నిబంధనలకు నీళ్లు వదిలి ఆలయంలో అపశృతికి కారణమయ్యాడు. పవిత్రమైన దేవాలంయలో కోడి మాంసం వండినట్లు తెలుస్తోంది. ఇటీవలే వైసీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ భర్త ఈ క్యాంటీన్ ను లీజుకి తీసుకున్నారు. భక్తులకు ఆహార పదార్థాలతో పాటు బయట వారి నుంచి కూడా వచ్చే ఆర్డర్లు తీసుకుంటూ వాటిని కూడా ఇక్కడే సిద్దం చేస్తూ క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు.
తాజాగా ఆలయం క్యాంటీన్ లో వండిన మాంసాహారాన్ని ఆలయం నుంచి పంపించేందుకు బయటకు తీసుకురాగా.. వాసన పసిగట్టిన భక్తులు కోందరు అది మాంసాహారమని అనుమానించి చూడగా.. అందులో చికెన్ వండి తీసుకువెళ్తున్నట్లు తేలింది. దీంతో పవిత్ర ఆలయంలో మాంసాహారాన్ని వండి బయటకు క్యాటరింగ్ కు పంపిస్తున్నట్లు చెబుతున్న భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భక్తులు తమ సెల్ ఫోన్లలో కోడికూర వండి తీసుకెళ్తున్న దృశ్యాలను ఫోటోలు తీశారు. అంతేకాదు ఈ వంటకాలన్నీ సిద్దం చేసి.. తీసుకెళ్లందుకు రిక్షాలో ఏర్పాటు చేయడం కూడా ఈ ఫోటోలలో కనిపించింది.
దీంతో దేవాలయ యాజమాన్యం, దేవాదాయశాఖ అధికారులు క్యాంటీన్‌ను మూసివేసి చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్‌ను సీజ్ చేశామని, అలాగే, నిర్వాహకుల లైసెన్స్‌ను రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. అయితే, ఆ మాంసాహారాన్ని బయటే వండారని, ఆ ఆహార పదార్థాల వాహనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్లు నిర్వాహకులు తమకు చెప్పారని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నిర్వాహకులకు ఇప్పటికే షోకాజ్ నోటీసు కూడా ఇచ్చామని చెప్పారు. మల్లేశ్వర స్వామి శివాలయం వద్ద మాంసాహారం వివాదంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వివరించారు.
క్యాంటీన్ నిర్వాహకుల నుంచి పూర్తిస్థాయిలో వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలయం వద్ద గతంలోనూ ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? అన్న విషయంపై కూడా విచారిస్తున్నామని చెప్పారు. క్యాంటీన్ నిర్వహణను ఇతర మతస్థులు చేస్తున్నట్లు తమకు తెలియదని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మరోపక్క ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘనటపై హిందూ ధార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాల నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. దేవాలయ పవిత్రతను దెబ్బతీసేలా ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 10 | లోన్ యాప్ ల ఆడగాల శృతిమించుతున్నాయి. చిటికలో రుణాలు ఇస్తామని చెప్పి.. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలను పొందిన రుణగ్రస్థుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీలతో పాటు రుణాలను తిరిగిపోందుతున్న డిజిటల్ యాప్ లపై ఎట్టకేలకు... Read more
Aug 10 | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొనసాగుతోంది. వాక్సీన్ అందుబాటులోకి రాగానే ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా 60 ఏళ్లకు పైనున్న పెద్దలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడిన వారికి ఇచ్చారు. ఆ తరువాత 45ఏళ్ల... Read more
Aug 10 | వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మామూలే. అడవి జంతువుల దాడిలో చాలా మంది గాయపడుతుంటారు. ఇప్పటివరకు మనకు ఏనుగులు, చిరుతలు, పెద్దపులులు, మొసళ్లు ఇలాంటి వన్యమృగాలు మాత్రమే జనవాసాల్లోకి వచ్చిన విషయం తెలుసు. కానీ దట్టమైన... Read more
Aug 10 | దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే కేసుల... Read more
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more