Friends gift bottles of petrol, diesel to couple as wedding gift in TN కొత్తజంటకు పెట్రోల్, డీజిల్ బాటిళ్ల కానుక.. నెట్టింట్లో వైరల్

Tamil nadu couple gets petrol and diesel as wedding gift amid fuel price hike

groom Grace Kumar, bride Keerthana, fuel price hike, petrol price, diesel price, Tamil Nadu couple, petrol diesel price hike, petrol diesel gift, tamil nadu petrol price today, wedding gift, Cheyyur village, Chengalpattu, Tamil Nadu, Social media, viral video

A newly married couple was gifted bottles of petrol and diesel by their friends, recently. A video went viral on social media, where a group of youth were seen gifting their newly married couple, a litre of petrol and diesel on their wedding day. This video from Cheyyur village of Chengalpattu district of Tamil Nadu has already attracted many viewers on social media.

ITEMVIDEOS: కొత్తజంటకు పెట్రోల్, డీజిల్ బాటిళ్ల కానుక.. నెట్టింట్లో వైరల్

Posted: 04/08/2022 12:38 PM IST
Tamil nadu couple gets petrol and diesel as wedding gift amid fuel price hike

పెట్రోల్ ధరలు 2014లో రూ. 80కి చేరుకోగానే గగ్గోలు పెట్టిన బీజేపి శ్రేణులు.. తాము అధికారంలోకి వస్తే ఇంధన ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను కూడా వంద రోజుల్లోకి నియంత్రించేందుకు చర్యలు చేపడతామని ఎన్నికల్లో చెప్పిన అధికారంలోకి వచ్చింది. కానీ ఆనాటి నుంచి అటు ఇంధన ధరలు, ఇటు నిత్యావసర సరుకుల ధరలను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంధన ధరలను అప్పటితో పోల్చితే ఏకంగా లీటరుపై రూ.40 మేర పెరిగింది. కేవలం ఎనమిదేళ్లలో ఇంధన ధరలు ఈ మేర పెరగడం.. అందునా రోజువారీ పెంపుకు శ్రీకారం చుట్టి ధరల వివరాలు ప్రజలకు తెలియకుండా చేయడంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తోంది.

ఇక అప్పటి మాదిరిగానే అంతర్జాతీయంగా ఇంధన ధరలు వున్నాయన్న విషయం తెలిసిందే. దీంతో ఇంత వ్యత్యాసం ఎందుకు.? ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్నలు కూడా వాహనదారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా కేంద్రం వాహనదారులను నిట్టనిలువునా దోపిడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ భారీగానే పేలుతున్నాయి. సామాన్యుడి పరిస్థితి మీద ట్రోల్స్​, మీమ్స్​ వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 17రోజుల్లో.. 14సార్లు పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. రోజు ఉదయాన్నే లేచి.. పెట్రోల్​ ధరలు పెరిగాయన్న వార్త విని సామాన్యులు గుండెలు పట్టుకుంటున్నారు.

ఇక ఇప్పుడు.. చమురు అనేది అత్యంత విలువైన వస్తువుగా మారిపోయిందనడంలో సందేహం లేదు. ఇంతటి విలువైన వస్తువుని.. నూతనంగా పెళ్లి చేసుకుంటున్న దంపతులకు వారి స్నేహితులు కానుకగా అందించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో చెంగల్ పట్టు జిల్లాలోని చెయ్యూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గిరీష్​ కుమార్​- కీర్తనకు కొన్ని రోజుల క్రితమే పెళ్లి జరిగింది. అదే సమయంలో నూతన దంపతులకు అందరు కానుకలు ఇచ్చారు. కొద్దిసేపటికి.. వారి స్నేహితులు స్టేజ్​ ఎక్కారు. పెట్రోల్​ బాటిల్​, డీజిల్​ బాటిల్​ను దంపతులకు గిఫ్ట్​ చేశారు. ఆ గిఫ్ట్​ను చూసి తొలుత ఆ దంపతులు షాక్​ అయ్యారు. చివరికి మ్యాటర్​ అర్థమయ్యి.. నవ్వుతూ ఆ గిఫ్ట్​లను తీసుకున్నారు.

ఈ వీడియోను ఓ నెటిజన్​.. ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఇది కాస్తా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే.. ఇలాంటి కానుకలు సరిగ్గా గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తరుణంలోనూ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడగానే దేశ ప్రజలపై వరుసగా ఇంధన భారాన్ని మోపింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో అటు కూరగాయాల ధరలకు కూడా ఆకాశాన్నంటిన తరుణంలో వధూవరులకు వారి స్నేహితులు కూరగాయలతో దండలను చేసి వరమాలగా వేసిన దృశ్యాలు కూడా నెటిజనులను ఆకర్షించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh