Paddy protests expose rift among TRS ranks నిండు నిరసన సభలో ఎంపీ మాలోతు కవితకు పరాభవం..

Trs mla snatches mike from party mp during protest in telangana s mahabubabad

Paddy protests, TRS, Mahabubabad MP, Maloth Kavita, Mahabubabad MLA, Banoth Shankar Nayak, MLC Takkalllapally Ravinder Rao, MInister Satyavathi Rathod, Dornakal MLA Redya Naik, microphone, Errabelli Dayakar Rao, Nannapaneni Narender, Warangal, Telangana, Politics

An ugly spat broke out between ruling Telangana Rashtra Samithi (TRS) party leaders, with an MLA snatching the microphone from an MP during a protest in Mahabubabad. TRS MLA Banoth Shankar Nayak of Mahabubabad snatched the microphone from his own party MP, Maloth Kavita, during a protest.

ITEMVIDEOS: టీఆర్ఎస్ లో బయటపడ్డ వర్గవిభేధాలు.. మహిళా ఎంపీ నుంచి మైక్ లాగేసున్న ఎమ్మెల్యే.!

Posted: 04/08/2022 11:48 AM IST
Trs mla snatches mike from party mp during protest in telangana s mahabubabad

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ చేపడుతున్న రైతు దీక్షలలో పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ అదిష్టానం పిలుపుమేరకు అన్ని జిల్లా కేంద్రాలలో రైతు దీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో మహబూబాబాద్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం మందు టీఆర్‌ఎస్‌ చేపట్టిన రైతు దీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోతు కవితకు పరాభవం ఎదురైంది.

రైతు దీక్షను ప్రారంభిస్తూ పార్లమెంటు సభ్యురాల మాలోతు కవిత మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మైక్‌ లాక్కున్నారు. తాను మాట్లాడుతున్నానని మంత్రి చెప్పినా.. ఎమ్మెల్యే పట్టించుకోలేదు. తను ముందు మాట్లాడాలని మంత్రి నుంచి మైక్‌ బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఎంపీ కవిత బిత్తరపోయారు. ఎమ్మెల్యే మైక్ లాక్కుని వేదిక నెక్కి ప్రసంగిచడంతో అమె టీఆరఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవిందర్ రావుతో జరిగిన పరాభవాన్ని వివరిస్తూ అమె కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ ఘటనకు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే జరిగింది.

అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పార్లమెంటు సభ్యురాలు కవిత తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఆధర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలు.. పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు ఆధ్యక్షతన జరుగుతాయని.. దీంతో పార్టీ అధ్యక్షురాలి అధ్యక్షతన జరుగుతున్న రైతు దీక్షలలో అని అనాలని మంత్రికి రెడ్యానాయర్ సూచించారు. కాగా టీఆర్ఎస్ రైతు దీక్షలో వర్గవిభేదాలు బయటపడటంతో దీక్షలో పాల్గొనడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఇక అటు వరంగల్ లోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీక్షస్థలి నుంచి వెళ్లిన తరువాత కానీ స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దీక్షకు హాజరుకాలేదు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles