కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ.. అధికార పార్టీ టీఆర్ఎస్ చేపడుతున్న రైతు దీక్షలలో పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ అదిష్టానం పిలుపుమేరకు అన్ని జిల్లా కేంద్రాలలో రైతు దీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో మహబూబాబాద్‌లోని తహసీల్దార్ కార్యాలయం మందు టీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ మాలోతు కవితకు పరాభవం ఎదురైంది.
రైతు దీక్షను ప్రారంభిస్తూ పార్లమెంటు సభ్యురాల మాలోతు కవిత మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కున్నారు. తాను మాట్లాడుతున్నానని మంత్రి చెప్పినా.. ఎమ్మెల్యే పట్టించుకోలేదు. తను ముందు మాట్లాడాలని మంత్రి నుంచి మైక్ బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఎంపీ కవిత బిత్తరపోయారు. ఎమ్మెల్యే మైక్ లాక్కుని వేదిక నెక్కి ప్రసంగిచడంతో అమె టీఆరఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవిందర్ రావుతో జరిగిన పరాభవాన్ని వివరిస్తూ అమె కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ ఘటనకు రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే జరిగింది.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పార్లమెంటు సభ్యురాలు కవిత తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఆధర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలు.. పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు ఆధ్యక్షతన జరుగుతాయని.. దీంతో పార్టీ అధ్యక్షురాలి అధ్యక్షతన జరుగుతున్న రైతు దీక్షలలో అని అనాలని మంత్రికి రెడ్యానాయర్ సూచించారు. కాగా టీఆర్ఎస్ రైతు దీక్షలో వర్గవిభేదాలు బయటపడటంతో దీక్షలో పాల్గొనడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఇక అటు వరంగల్ లోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీక్షస్థలి నుంచి వెళ్లిన తరువాత కానీ స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దీక్షకు హాజరుకాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more
Aug 11 | అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు... Read more
Aug 11 | విమానంలో ధూమపానం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. పొరపాటున ఊహించనది జరిగితే అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంతే! అలాంటి చోట నియమాలు. భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ, స్పైస్‌జెట్ విమానంలో ఓ ఇన్‌స్టా సెలబ్రిటీ... Read more
Aug 11 | ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుపర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీలపై... Read more
Aug 11 | తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్... Read more