HC notices to State over ED contempt plea టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సీఎస్ కు హైకోర్టు ధిక్కార నోటీసులు

Telangana high court serves notices to chief secretary in drugs case

Telangana High Court, Telangana government, Telangana drugs case, Telangana High Court news, Telangana High Court in drugs case, Telangana Chief Secretary, Telangana Excise Director, Enforcement Directorate, Telangana drugs case news, Telangana drugs case latest, Telangana drugs case breaking news, Telangana High Court serves notices to Chief Secretary in Drugs Case

The Enforcement Directorate filed a petition in the Telangana High Court that the government failed to produce the call data and the digital records of the accused. The case came for hearing today and the High Court of Telangana issued summons to Chief Secretary Somesh Kumar and Excise Director Sarfaraz in the issue. The court asked them to come up with an explanation in ten days.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సీఎస్ కు హైకోర్టు ధిక్కార నోటీసులు

Posted: 04/07/2022 09:12 PM IST
Telangana high court serves notices to chief secretary in drugs case

తెలంగాణ టాలీవుడ్ ప్రముఖలకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారంలో తమ అదేశాలను అమలుపర్చకుండా తాత్సారం చేయడంతో పాటు ధిక్కారానికి పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ల‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రికార్డుల‌ను ఇవ్వ‌డం లేదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాఖ‌లు చేసిన కోర్టు ధిక్కార పిటిష‌న్ విచార‌ణను న్యాయస్థానం ఇవాళ చేపట్టింది.

ఈ సంద‌ర్భంగా ఈడీ అధికారులకు సంబంధిత సమాచారం ఇవ్వని కారణంగా కోర్టు ధిక్కారానికి పాల్పడిన సోమేశ్ కుమార్‌, స‌ర్ఫ‌రాజ్‌ల‌ అహ్మద్ లకు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ అయ్యాయి. టాలీవుడ్ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ వాడారంటూ దాఖ‌లైన కేసును గ‌తంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ విచారించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్య‌వ‌హారంలో మ‌నీ ల్యాండ‌రింగ్ కూడా జ‌రిగింద‌న్న ప్రాథ‌మిక స‌మాచారంతో ఈడీ కూడా కేసు న‌మోదు చేసింది. విచార‌ణ‌లో భాగంగా నాడు ద‌ర్యాప్తు చేసిన బృందం సేక‌రించిన నిందితుల కాల్ డేటా, డిజిట‌ల్ రికార్డులు అంద‌జేయాల‌ని తెలంగాణ స‌ర్కారుకు ఈడీ లేఖ రాసింది.

ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఈడీ అధికారులు నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈడీ అభ్య‌ర్థ‌న‌కు సానుకూలంగా స్పందించిన హైకోర్టు... ఈడీ కోరిన వివ‌రాల‌న్నీ అందించాలంటూ గతంలోనే తెలంగాణ స‌ర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఇంకా వివ‌రాలు అంద‌లేద‌ని తాజాగా మరోమారు హైకోర్టును ఆశ్ర‌యించిన ఈడీ... తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించింది. ఈ వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు సీఎస్‌తో పాటు ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ కు నోటీసులు జారీ చేసింది. తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles