Mother deer dies while saving her baby from crocodile attack బిడ్డను ఆపద నుంచి రక్షించాలని మాతృమూర్తి ప్రాణత్యాగం

Heartbreaking video mother deer dies while saving her baby from crocodile attack

mother deer saves baby, baby deer chills in water, deer saves baby, crocodile attacks deer video, IAS officer Sonal Goel, heartbreaking video, video viral, Twitter, viral video

A mother will fight all odds to protect her child from any danger, even if it means sacrificing herself. The video you are about to watch is proof. IAS officer Sonal Goel shared a video of a crocodile about to attack a fawn but the mother deer jumps to its rescue. She sacrifices herself to save her baby. The video is heartbreaking and also a reminder of a mother’s unconditional love for her child.

ITEMVIDEOS: కదిలించే ఘటన: బిడ్డను ఆపద నుంచి రక్షించాలని మాతృమూర్తి ప్రాణత్యాగం

Posted: 04/07/2022 07:25 PM IST
Heartbreaking video mother deer dies while saving her baby from crocodile attack

సకల చరాచర సృష్టిలో పునరుత్పత్తి చేసే అదృష్టం కలిగింది ఒకటి దైవం అయితే మరోకటి అమ్మ. అందుకనే అమ్మను ప్రకృతితో పోల్చుతారు. అమ్మ అనే రెండు అక్షరాల పదమే.. బిడ్డకు పెద్ద అండ.. వక్రమార్గంలోకి వెళ్తున్న బిడ్డను కోపంతో దండించినా.. అది అమ్మ తన బిడ్డను సన్మార్గంలోకి నడిపించేందుకు కఠినంగా చేసే ప్రయత్నమే. పశ్చిమ బెంగాల్ లో ఓ అమ్మ తన బిడ్డను కాపాడుకునేందుకు ఏకంగా పెద్దపుతిలోనే తలపడిందంటే అమ్మలోని సముద్రమంత లోతైన ప్రేమకు ఇదే నిదర్శనం. కేవలం మనుషులలో మాత్రమే కాదు.. పశుపక్షాదులలోనూ అమ్మకున్న ప్రేమ అదే. తమ బిడ్డలకు కష్టం రానీయకుండా ప్రతీ అడుగునూ ఆచితూచి వేయాలని నేర్పిస్తుంటాయి.

తాజాగా అమ్మ ప్రేమను, త్యాగనిరతిని, ప్రాణత్యాగాన్ని చాటే ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. బిడ్డను కాపాడుకునేందుకు తల్లి.. ఎంత దూరమైనా వెళ్తుందని చాటిచెప్పే ఈ వీడియో మనస్సున్న ప్రతీ ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. రాయిలాంటి గుండె ఉన్నవారిని కూడా కదిలిస్తోంది. సొంత ప్రయోజనాలను సైతం పక్కనపెట్టి బిడ్డ కోసం కృషి చేస్తుంది. ఓతల్లి జింక.. తన బిడ్డను రక్షించుకునేందుకు ప్రాణత్యాగం చేసింది. మనిషైనా.. జంతువైనా.. తల్లి ప్రేమ ఒకటే అని నిరూపించింది! ఐఏఎస్​ ఆఫీసర్​ సోనాల్​ గోయల్​.. మాతృమూర్తి వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

వీడియోలో.. ఓ జింక పిల్ల.. ఓ నదిలో ఈత కొడుతూ ఉంది. నదిలోకి దిగిన ఆనందంలో ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. అయితే నదిలో ఉన్న ఓ మొసలి.. జింక పిల్లను చూసింది. ఆహారం కోసం ఆ జింక పిల్లపై దాడి చేసేందుకు అటువైపు వేగంగా కదిలింది. ఈ దృశ్యాలను దూరం నుంచి చూసిన ఆ తల్లి జింక.. నదిలోకి దూకి.. వేగంగా బిడ్డవైపు కదిలింది. బిడ్డకు, మొసలికి మధ్య తన శరీరాన్ని అడ్డుపెట్టింది. అలా.. మొసలికి ఆహారంగా మారిపోయింది. ప్రాణ త్యాగంతో తన బిడ్డను రక్షించుకుంది. తల్లి జింకను నోట కరుచుకుని.. మొసలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్ల జింక ఒంటరిగా మిగిలిపోయింది!

"తల్లి ప్రేమను వర్ణించేందుకు మాటలు సరిపోవు. బిడ్డను రక్షించుకునేందుకు తల్లి జింక చేసిన ప్రాణత్యాగం హృదయాన్ని కదిలిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఎప్పటికి విడిచిపెట్టకూడదని ఈ వీడియో మనకు గుర్తుచేస్తోంది. వాళ్లని గౌరవించాలి, వారికి సేవ చేయాలి," అని ట్వీట్​లో రాసుకొచ్చారు ఐఏఎస్​ ఆఫీసర్​ సొనాల్​ గోయల్​. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తల్లి జింక ప్రాణత్యాగం అందరిని కదిలిస్తోంది. తల్లిప్రేమను గుర్తుకుచేసే విధంగా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles