Mahindra posts video showing 360 degree view of Mount Everest దేశానికి ఈ సాంకేతికత కావాలన్న ఆనంద్ మహీంద్రా!

Anand mahindra wants gadkari to bring this ingenious tech to india s highways

anand mahindra, Turkish company, nitin gadkari, enlil wind turbine, anand mahindra tweets, Enlil wind turbine, Devecitech, Mahindra Group, anand mahindra net worth, Anand Mahindra shares a video of mount Everest, Mount Everest 360 degree view, Nature video Mount Everest, Twitter, social media, viral video

Industrialist Anand Mahindra has shared a video of a unique technology that can generate electricity from traffic. Gearhead Mahindra is so much in awe of this Turkey-based technology that he has asked Union Minister of Road and Transport Nitin Gadkari to try to implement the same in India.

ITEMVIDEOS: మౌంట్ ఎవరెస్ట్ ఇలా.. దేశానికి ఈ సాంకేతికత కావాలన్న ఆనంద్ మహీంద్రా!

Posted: 04/07/2022 06:31 PM IST
Anand mahindra wants gadkari to bring this ingenious tech to india s highways

సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నిత్యం ముందుంటారు. తన గ్రూపు వ్యాపారాల కోసమే కాదు.. ఆయన తన హృదయాన్ని హత్తుకున్న వీడియోలను కూడా తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. అయితే ఈ క్రమంలో అడపాదడపా కొందరికి వరాలు కూడా కురిపిస్తుంటారు. పాత ద్విచక్రవాహనాల సామాగ్రితో కారును తయారు చేసిన వ్యక్తికి కొత్త బోలెరో వాహనాన్ని అందించారు. అంతేకాదు సృజనాత్మకమైన ఐడియాలతో ముందుకువచ్చే ఇన్నోవేటర్స్ కు కూడా తన సహకారం అందించేందుకు ముందుంటారు.

సైకిల్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ కిట్ రూపోందించిన గురు సౌరబ్ అండగా వుంటానని ప్రోత్సహించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించి వెన్నుతట్టుతుంటారు. అలాంటి ఆనంద్ మహీంద్ర తాజాగా మౌంట్ ఎవరెస్ట్ కు సంబంధించి వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. మరొకరు పోస్ట్ చేసిన వీడియోను ఆయన రీపోస్ట్ చేశారు. ‘‘మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై నుంచి 360 డిగ్రీల కోణంలో చూపించేది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. నీవు ఎవరెస్ట్ శిఖరంపై ఉన్నావని ఊహించుకుని, ప్రపంచాన్ని విశాలంగా చూసేందుకు ఇది సాయపడుతుంది. పెద్ద అంశాన్ని సులభంగా చూడొచ్చు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో దేశం సూపర్ పవర్ గా ఎదిగేందుకు దోహదపడే విండ్ టర్భైన్ల గురించి ప్రస్తావించారు. ఈ తరహా సాంకేతికతను భారత్ పోందగలిగి.. అమలుపర్చితే కచ్చితంగా ప్రపంచశక్తిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. నిత్యం ట్రాఫిక్ నడిచే రోడ్డు మధ్యలో ఓ గాలితో తిరిగే టర్బైన్ ఉంటుంది. వాహనాల వేగానికి ఆ టర్బైన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగా ఒక గంటలోనే 1 కిలోవాట్ శక్తి జనిస్తుంది. ఈ సాంకేతికతను టర్కీలోని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

భారత్ లో ఎంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందో తెలిసిందేనని, ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే పవన విద్యుత్ రంగంలో భారత్ కూడా అగ్రగామిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. అంతేకాదు, టర్కీ అభివృద్ధి చేసిన విండ్ టర్బైన్ పనితీరు వీడియోను కూడా పంచుకున్నారు. తన ట్వీట్స్ తో సానుకూల ఆలోచనలను, భావాలను పెంచే ప్రయత్నం కూడా ఆనంద్ మహీంద్రా చేస్తుంటారు. ఆయన ట్వీట్స్ ఎంతో మందిని ఆలోచింపజేస్తుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles