Rat set house on fire along with Rs 2 Lakhs cash చిట్టిఎలుక.. రూ.2 లక్షల నగదుతో పాటు ఇంటినే తగులబెట్టింది..!

Rat set businessman house on fire along with rs 2 lakhs cash

Rat, Mice, Million of Items, House set on fire, Vinod Bhai, Business Man, Rs 2 Lakh Cash, Karmabhumi Society, Ahmedabad, Gujarat, Crime

Mortality in mice is common. The house is full of rats. Millions of items, including 2 lakh cash at home, were burned. The whole house was burned to the ground by a rat. Yes, the house of businessman Vinod at Karmabhumi Society near Ahmedabad, Gujarat, caught fire with a mouse.

చిట్టిఎలుక.. రూ.2 లక్షల నగదుతో పాటు ఇంటినే తగులబెట్టింది..!

Posted: 04/07/2022 03:27 PM IST
Rat set businessman house on fire along with rs 2 lakhs cash

గుజరాత్​లో ఓ ఎలుక చేసిన పనికి వ్యాపారవేత్తకు పెను నష్టం వాటిల్లింది. అంతేకాదు నిలువనీడ లేకుండా పోయింది. ఇటీవల తెలంగాణలోకి ఓ రైతు కూడబెట్టుకున్న రెండు లక్షల రూపాయలను ఎలుకలు ముక్కలు చేసి.. పనికి రాకుండా చేసిన ఘటన తెలిసిందే. అయితే గుజరాత్ లో ఎలుకలు మాత్రం అంతకుమించిన నష్టం వాటిల్లేలా చేశాయి. చైత్రమాసంలో ఇంట్లో ఎలుకలు వున్నా వాటిని పెద్దగా పట్టించుకోని వ్యాపారవేత్త.. యధాతథాంగా పూజలు నిర్వహించడం అతనికి నిలువనీడను కరువ్వయ్యేలా చేసింది. అతని ఇల్లు కాలిపోయింది. అంతేకాదు వ్యాపారంలో భాగంగా తెచ్చుకుని వేలాది వస్తువులతో పాటు రెండు లక్షల రూపాయల నగదు దగ్ధమైంది.

స్థానికులు మోటార్ పైపుతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఇంతలా భారీ నష్టాన్ని ఎలుక ఎలా చేసిందన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. చైత్ర నవరాత్రుల సందర్భంగా గుజరాత్​ వ్యాపారవేత్త వినోద్ భాయ్ తన ఇంట్లో నెయ్యితో దీపం వెలిగించాడు. ఇంకేముంది.. నెయ్యితో వున్న దీపం ఒత్తి కోసం ఎలుక ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే చాలా తెలివిగా దీపంలోని ఒత్తిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లింది ఎలుక.

అయితే ఇలా చేసిన తరుణంలో సర్వసాధారణంగా దీపం కొద్దిసేపు వెలిగ ఆ తరువాత ఆరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలుక దీపం తీసుకెళ్లిన ప్రాంతంలో బట్టలు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఇంకేముందు వెంటనే మంటలు అంటుకుని ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఇది గమనించిన ఇంట్లోని సభ్యులు మంటలను అదుపు చేసే క్రమంలో అక్కడే ఉన్న రూ.2 లక్షల నగదు అగ్నిని ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే ఆస్తినష్టం మాత్రం బాగానే వాటిల్లింది. ఈ ఘటన గుజరాత్​లోని ఏఎమ్​టిఎస్​ బస్​ స్టేషన్ వెనుక కర్మభూమి సోసైటీలో జరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles