MIM corporator argues with Charminar SI బోలక్ పూర్ ఘటనపై ముషీరాబాద్ ఎమ్మెల్యే వీడియో సంచలనం

Mim corporator sohail quadri argues with charminar sub inspector video goes viral

Pathergatti Corporator Syed Sohail Quadri, AIMIM corporator Syed Sohail Quadri, corporator Sohail Quadri argues with Sub Inspector, Pathergatti corporator Quadri vs Charminar SI, Pathergatti corporator Quadri on parking issue, Pathergatti corporator Quadri on parking at Unani Hospital, Charminar SI at Unani Hospital, Ghousuddin Taha, MIM Corporator, Bholakpur corporator, Hyderabad police, Hyderabad commissionerate, Telangana, crime

Tension escalated after a heated argument took place between Charminar MIM Corporator and SI over a parking issue at Unani Hospital, Old City. According to the reports, AIMIM Corporator Sohail Quadri expressed anger after Unani Hospital College management locked the gates denying parking on the premises.

ITEMVIDEOS: చార్మినార్ ఎస్ఐతో మరో ఎంఐఎం కార్పోరేటర్ వాగ్వాదం

Posted: 04/07/2022 04:31 PM IST
Mim corporator sohail quadri argues with charminar sub inspector video goes viral

పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగించినందుకు భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ తాహాను పోలీసులు అరెస్టు చేసి 24 గంటలు కూడా కాకముందే మరోమారు మరో ఎంఐఎం కార్పోరేటర్ ఏకంగా చార్మినార్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐతో వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. భోలక్ పూర్ పరిధిలో అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో దుకాణాలు, హోటళ్లు తెరచివున్న నేపథ్యంలో పోలీసలు వాటిని బంద్ చేయిస్తుండగా వారిని అడ్డుకుని విధులకు ఆటకం కలిగించడంతో పాటు.. వారిపై దుర్భాషలాడిన ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ తాహపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన సంభవించి 24 గంటలు కూడా గడవకముందే అదే మజ్లిస్ పార్టీకి చెందిన మరో కార్పోరేటర్ ఏకంగా ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. చార్మినార్ జోన్ కు చెందిన పత్తర్ గట్టి కార్పోరేటర్ ఏకంగా చార్మినార్ పోలిస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐకి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. పత్తర్ గట్టిలోని ఉనాని కాలేజీ యాజమాన్యం తమ కాలేజీ ఆవరణలో కొందరు వాహనదారులు నిత్యం వాహనాలు పార్క్ చేస్తున్నారని.. దీంతో తమ కాలేజీకి వచ్చే విద్యార్ధులు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వారు పిర్యాదు చేశారు.

దీంతో కాలేజీ యాజమాన్యం గేట్లను మూసివేసింది. దీంతో కాలేజీ వద్దకు వచ్చిన ఎస్ఐను చూసిన కార్పోరేటర్ సయ్యద్ సోహైల్ ఖాద్రీ ఇరుకైన రోడ్లు.. కాలేజీలోని గ్రౌండ్ లో వాహనాలు పార్క్ చేస్తున్నామని ఇది ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పారు. అయినా కాలేజీ సిబ్బందికి, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కాళాశాల యాజమాన్యం పిర్యాదు చేసిందా.? అని ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ చాకచక్యంగా వ్యవహరించి.. తమకు ఎవరు పిర్యాదు చేశారన్నది ముఖ్యం కాదని, అయితే సమస్య ఉత్పన్నం అవుతుందా.? లేదా.? అన్నదే ముఖ్యమని వివరించారు.

దీంతో ఎన్నోఏళ్లుగా ఇక్కడ స్థానిక దుకాణాదారులతో పాటు దుకాణాల్లోకి వచ్చే కస్టమర్లు ఇక్కడ తమ వాహనాలను పార్క్ చేస్తుంటారని అన్నారు. ఇక రంజాన్ సహా శుక్రవారాల్లో వాహనాలు ఎక్కువగా ఉంటాయని ఎస్ఐకి కార్పోరేటర్ ఖాద్రీ వివరించారు. అయితే తొలుత ఎస్ఐపై దగ్ధద స్వరంలో మాట్లాడిన కార్పోరేటర్.. ఆయనతో తీవ్రంగా వాదించారు. దీంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్న ఎస్ఐ.. స్థానిక ఉనాని వైద్య కాళాశాల యాజమాన్యంతో చర్చించి.. గేట్లు తెరిపించి.. సమస్యకు పరిష్కారం చూపారు. కాగా, భోలక్ పూర్ ఘటన మరువక ముందే మరో ఘటనలో మజ్లిస్ కార్పోరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles