TRS MLA appeals police on Bholakpur incident బోలక్ పూర్ ఘటనపై ముషీరాబాద్ ఎమ్మెల్యే వీడియో సంచలనం

Musheerabad trs mla appeals police on bholakpur incident video goes viral

Musheerabad MLA Muta Gopal, MLA appeals Police on 24 hours shopping, MLA Muta Gopal on Bholakpur incident, Musheerabad MLA Muta Gopal appeals Police, K Laxman twitter, TRS MLA Gopal video on K Laxman Twitter, Ghousudding Taha, MIM Corporator, Bholakpur corporator, Night Patrolling Police, Hyderabad police, Hyderabad commissionerate, MLA Raja Singh, KTR, DGP Mahender Reddy, Hyderabad, Telangana, crime

The Musheerabad police arrested Bholakpur corporator Mohd Ghousuddin for allegedly obstructing policemen from performing their duty and threatening them two days ago. Now the Musheerabad MLA Mutha Gopal video goes viral, who appeals police officials not to close any kind of shops even in the midnight within his constituency during ramadan period.

ITEMVIDEOS: బోలక్ పూర్ ఘటనపై ముషీరాబాద్ ఎమ్మెల్యే వీడియో సంచలనం

Posted: 04/07/2022 01:39 PM IST
Musheerabad trs mla appeals police on bholakpur incident video goes viral

పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారి విధులు నిర్వహించకుండా ఆటంకం కలిగించినందుకు భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భోలక్ పూర్ పరిధిలో అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో దుకాణాలు, హోటళ్లు తెరచివున్న నేపథ్యంలో పోలీసలు వాటిని బంద్ చేయిస్తుండగా వారిని అడ్డుకుని విధులకు ఆటకం కలిగించడంతో పాటు.. వారిపై దుర్భాషలాడిన ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ తాహకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. వాటిపై స్పందించిన కేటీఆర్.. కార్పోరేటర్ పై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. దీంతో కదిలిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలను బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నెటిజనులు రాష్ట్రమంత్రి కేటీఆర్, డీజీపి మహేందర్ రెడ్డీల కు ట్యాగ్ చేసి.. ఇలాంటివారిపై చర్యలు చేపట్టగలరా.? అని కామెంట్ చేశారు. దీంతో ఈ వీడియోలపై ట్విటర్‌ వేదికగా స్పందించిన కేటీఆర్‌.. పోలీసులపై ఇలాంటి జులం తెలంగాణలో కొనసాగదని కామెంట్ చేసిన కేసీఆర్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్‌పూర్ కార్పొరేషన్‌ గౌసుద్దీన్‌ పై సెక్షన్‌ 350, 506 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

కాగా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ప్రాంతం స్లమ్ ఏరియా అని అక్కడ 24 గంటల పాటు దుకాణాలను రంజాన్ మాసంలో తెరిచే ఉంచాలని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పోలీసలు అధికారులకు విన్నవించారు. రెక్కడితే కానీ డొక్కాడని జీవులు ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేసుకుని.. రాత్రి పూట వెసలుబాటు చేసుకుని పండగకు షాపింగ్ చేస్తుంటారని, వారి కోసం దుకాణాలను రంజాన్ మాసంలో 24 గంటల పాటు తెరచుకునే వెసలుబాటు కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఇదే అంశం పెద్ద సమస్యగా కూడా మారే అవకాశముందని.. ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటించాలని కోరారు.

అయితే ఎమ్మెల్యే ముఠా గోపాల్ దుకాణాదారులపై పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అనగా.. పోలీసులనే వారు బెదిరిస్తున్నారని అవతలి వ్యక్తి (పోలీసు అధికారి) చెప్పారు. దీంతో దానిని సమర్ధించుకునే క్రమంలో పోలీసులు ఇబ్బందులను తట్టుకోలేక వారు తిరగబడుతున్నారే తప్ప.. పోలీసులు వెళ్లకపోతే సమస్యే లేదని ఆయన చెప్పడం కొసమెరుపు. ఈ వీడియోను బీజేపి జాతీయ ఉపాధ్యక్షుడు కె లక్ష్మణ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక కేటీఆర్ ఆదేశాలను కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోరా.. భోలక్ పూర్ లో దుకాణాలను 24 గంటలు తెరచివుంచాలని అదేశాలను ఇస్తన్న స్థానిక ఎమ్మెల్యే అంటూ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles