బంజారాహిల్స్ ర్యాడిసన్ హోటల్ లోని పుడింగ్ పబ్ లో డ్రగ్స్ సేవిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు నిన్న అర్థరాత్రి అకస్మాత్తుగా దాడి చేయడంలో ఏకంగా 150 మందిని పోలీసులు బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. కాగా వీరిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సంతానం వున్నారని సమాచారం. అయితే 150 మందిలో కొందరు ప్రముఖుల పేర్లను పోలీసులు మీడియాకు బహిర్గతం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. పబ్ లో 150 మంది ఉన్నారని, అయితే పబ్ లో ఉన్నావారంతా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో వారు మండిపడుతున్నారు.
తాము పబ్ లో ఉన్నమాట నిజమేనని, అయితే డ్రగ్స్ తీసుకున్నామని మీడియా ఎలా నిర్థారించి తమ పేర్లను చెబుతూ.. ఫోటోలను చూపుతూ తప్పుడు ప్రచారం చేస్తుందని వారు ప్రశ్నించారు. కనీసం పోలీసులు కూడా తమ రక్తనమూనాలను తీసుకోకుండా.. మాదకద్రవ్యాల కేసులో తమ పేర్లను ఎలా బహిర్గతం చేస్తారని పలువురు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. పబ్ లో తాము అప్టర్ పార్టీకి వెళ్లామని.. రాత్రి సమయంలో పోలీసులు దాడులు చేశారని, అయితే నిర్ణీత సమయం ముగిసినా పబ్ తెరచివుండటంతో పోలీసులు వచ్చారని భావించామే తప్ప.. అక్కడ ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదని ప్రముఖులు తెలిపారు.
తాము అప్టర్ పార్టీ కోసం పుడింగ్ పబ్ కు వెళ్లామని ఈ మాట నిజమేనని, అయితే అక్కడ తాము పార్టీలో మాత్రమే పాల్గోన్నామని, అంతేకానీ.. ఎలాంటి ఇతరాత్ర వ్యవహారాలతో తమకు సంబంధం లేకపోయినా.. తమ పేర్లను, ఫోటోలను చూపుతూ మీడియాలో తప్పుడు కథనాలు రావడం చాలా బాధాకరంగా వుందని షార్ట్ ఫిల్మ్ నటి, జూనియర్ అర్టిస్ట్ కల్లపు కుషిత తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. తాము మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తే తమ రక్తనమూనాలను సేకరించాలని.. అమె పేర్కోన్నారు. తాము డ్రగ్స్ తీసుకున్నట్లు తప్పుడు ప్రచారం ఆపాలని, తమకు కుటుంబాలు వున్నాయని తప్పుడు ప్రచారంతో తమ పరువు తీయవద్దని అమె కోరారు.
టాలీవుడ్ గాయకుడు, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ.. తమపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. తాము పబ్ కు వెళ్లినంత మాత్రాన తాము డ్రగ్స్ తీసుకున్నామని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహరంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. పబ్ లో పార్టీకి తాను కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యానని, తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ జరిగినట్లు తెలిపాడు. ఇక అరగంట ఆగిన తరువాత వెళ్లామని అనుకుంటున్న తరుణంలో పోలీసులు రావడం.. అరెస్టు చేయడం జరిగిపోయిందన్నారు.
తమను పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తరువాత కూడా అసలేం జరుగుతుందో తెలియదని రాహుల్ అన్నారు. కాగా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారన్న విషయం అప్పుడు తెలిసిందన్నారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్‌నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహులు పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more