Raid at Radisson Blu Hotel in Hyderabad సంచలనం రేపుతున్న టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం

Hyderabad police arrest two seize cocaine packets after raiding pub

Pudding and Mink pub, Radisson Blu Plaza Hotel, 6 grams of cocaine, Kallapu Kushita, Junior artist Kallapu Kushita, Rahul Sipligunj, rahul sipligunj in drugs case, Tollywood Drugs Case, Movie News, Radisson Blu Plaza Hotel. Drugs, Banjara Hills, tollywood drugs case, Hyderabad Police, Telangana, Crime

Task Force Police conducted sudden raids at Pudding and Mink pub in Radisson Blu Plaza Hotel, located in upscale locality of Banjara Hills in the early hours of Sunday and seized more than 6 grams of cocaine and took into custody several high profile celebrities.

సంచలనం రేపుతున్న పుడ్డింగ్ అండ్ మింట్ పబ్ డ్రగ్స్ వ్యవహారం

Posted: 04/04/2022 11:04 AM IST
Hyderabad police arrest two seize cocaine packets after raiding pub

నషాముక్త్ హైదరాబాద్ గా నగరాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్న పోలీసులు అదివారం అర్థిరాత్రి బంజారాహిల్స్ ర్యాడిసన్ హోటల్ పై దాడి చేయగా అక్కడ మాదకద్రవ్యాలు లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. హోటల్ లోని పుడింగ్ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారని, అక్కడి పబ్ నిర్వాహకులే మాదకద్రవ్యాలను సరఫారా చేస్తున్నారన్న అనుమానంపై వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరితో పాటు పబ్ లో వున్న ప్రముఖులు, ప్రముఖుల పిల్లలను కూడా పోలిస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. స్టేషన్లో వారి వివరాలను నమోదు చేసుకున్న తరువాత సోంత పూచికత్తుపై వారిని వదిలిపెట్టారు.

కాగా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. గత కొంతకాలంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పబ్‌లలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం ఉన్నా, లైట్ తీసుకొని చూసీచూడనట్లు వదిలేశారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుడింగ్ పబ్‌‌లో విచ్చల విడిగా డ్రగ్స్‌తో పాటు కొకైన్ తీసుకుంటున్నట్లు పక్కా సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడి చేశారు. పోలీసులను గమనించిన నిందితులు, నిర్వాహకులు ఎక్కడికక్కడే డ్రగ్స్ ప్యాకెట్లను పడేసి పరారయ్యారు.

పోలీసుల దాడిలో సుమారు 150 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ సినీ నటుడి కుమార్తె, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె సహా పలువురు ఉన్నారు. బంజారాహిల్స్ ర్యాడిసన్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సీఐని బాధ్యున్ని చేస్తూ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని, కేవలం సీఐని మాత్రమే బలిపశువును చేస్తూ.. ఉన్నతాధికారులు తప్పించడంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నాతాధికారులకు సమాచారం ఉన్నా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చివరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బంజారాహిల్స్ సిఐపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై కూడా దిగువస్థాయి పోలీసులు వర్గాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుండగా తాము పబ్ కు వెళ్లిన మాట నిజమేనని, అయితే అంతమాత్రాన తాము డ్రగ్స్ తీసుకున్నామని తమ ఫోటోలను, పేర్లను పోలీసులు బహిర్గతం చేయడం.. మీడియా ప్రతినిధులకు వెలువరించడంపై ప్రముఖులు, సెలబ్రిటీలు తప్పుబడుతున్నారు. పబ్ కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాము డ్రగ్స్ తీసుకోలేదని మరికోందరు వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles