Ramdev lashes out at journalist on questioning over fuel price ‘‘నోర్మూయ్..’’ రిపోర్టర్ కు బాబా రాందేవ్ వార్నింగ్

Ramdev says shut up to reporter asking about petrol at rs 40 comment

Ramdev petrol price, Baba Ramdev petrol, Baba Ramdev reporter, Baba Ramdev reporter threat, Baba Ramdev Journalist shut up, baba ramdev on his previous comments, baba ramdev on indian hardwork, ramdev warns reporter, baba ramdev warns journalist, baba ramdev on inflation, Ramdev, petrol at Rs 40, petrol price today, Ramdev video viral

Yoga guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. During an event in Haryana's Karnal, a journalist asked the Patanjali brand ambassador about his comment to the media that people should consider a government that can ensure petrol for ₹ 40 a litre and cooking gas at ₹ 300 a cylinder.

ITEMVIDEOS: ‘‘నోర్మూయ్.. మళ్లీ అడిగితే మంచిగుండదు..’’ రిపోర్టర్ కు బాబా రాందేవ్ వార్నింగ్

Posted: 03/31/2022 05:56 PM IST
Ramdev says shut up to reporter asking about petrol at rs 40 comment

యోగా గురు బాబా రామ్‌దేవ్‌ సహనం కోల్పోయారు. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేశారు. నోర్మూయ్.. మళ్లీ అడిగితే నీకే మంచిది కాదు అంటూ పాత్రికేయుడిపై స్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బాబా రాందేవ్ చక్రం తిప్పడం ప్రారంభించారు. అయితే ఓ కార్యక్రమంపై వచ్చిన ఆయన.. హర్యానాలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ సహనాన్ని కోల్పోయారు. వివరాల ప్రకారం.. రామ్‌దేవ్‌ హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, అంతకు ముందు 2014లో బాబా రామ్‌ దేవ్‌ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్‌, రూ. 300 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఓ మీడియా విలేకరి గతంలో బాబా రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలపై ప్రశ్నించారు. దీంతో బాబా రామ్‌ దేవ్‌ సహనం కోల్పోయి లైవ్‌లోనే బెదిరించారు. తాజాగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరి, రామ్‌ దేవ్‌ బాబా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అవును, ఇప్పుడు ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలు అడగకండి.. నేనేమీ మీ కాంట్రాక్టర్‌ను కాదు.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..’’ అన్నారు.

ఇంతో సదరు విలేకరి మరోసారి ప్రశ్నించగా.. అతడిపై రామ్‌ దేవ్‌ సీరియస్‌గా చూస్తూ..‘‘ నేను, ఆ వ్యాఖ‍్య చేశాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు)? నోరు మూసుకో. మళ్లీ అడగితే అది నీకు మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం బాబా రామ్‌ దేవ్‌ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను సన్యానిగా ఉంటూనే ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రతిరోజు శ్రమిస్తానని తన అనుచరుల కరతాళధ్వనుల మధ్య బాబా రాందేవ్ చెప్పుకోచ్చారు.

‘‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అందుకు ఒప్పుకుంటాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. దీంతో గత పది రోజులలో తొమ్మిది రోజుల పాటు పెరిగిన ఇంధన ధరలు.. మొత్తంగా లీటరుకు రూ. 6.40 మేర ధర పెరిగింది.
 

Yoga Guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. @ndtv pic.twitter.com/kHYUs49umx

— Mohammad Ghazali (@ghazalimohammad) March 30, 2022

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles