Six youths obstruct cops, booked for ruckus డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి.. ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరంగం

Medchal mla followers fight with traffic police in drunk drive checking at banjara hills

Drunkard Hulchal, Drunkard Hulchal in Banjara hills, Harshavardhan Reddy, Patancheru, Creta car, drunk and drive test, Business man poses as MLA followers, Medchal MLA followers, businessman Kirankumar Reddy and followers Hulchul, Banjara hills dnd tests protest, protest against police DND Test, drunkard car driving, driving under the influence, driving car in inebriated condition, Drunkard Hulchal, Business Man KiranKumar Reddy, Medchal MLA, Drunk and Drive Test, Banjara hills, Hyderabad police, Telangana, Crime

Claiming to be followers of the Medchal MLA, six youngsters created a scene on the road near the Park Hyatt late on Tuesday, only to be booked on charges of public nuisance and assaulting a public servant. According to the police, the six youths created a ruckus when the traffic cops were checking vehicles for drunken driving. They accused the cops of letting some vehicles drive by without testing the drivers while using the breathalysers on others.

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి.. ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరంగం

Posted: 03/31/2022 04:50 PM IST
Medchal mla followers fight with traffic police in drunk drive checking at banjara hills

హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యంసేవించి వాహనాలను నడపరాదని ఓ వైపు పోలీసులు చెబుతున్నా.. వాటిని పెడచెవిన పెట్టిన మందుబాబులు.. మద్యం మత్తులోనే తమ కార్లను నడుపుకుంటూ అడ్డంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు. ఇటీవల మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఓ కారు, రెండు ఆటోలు, రెండు బైకులను ఢీకొట్టిన.. హుందాయ్ క్రెటా కారు వాహనచోదకుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించిన పోలీసులు అతడిలో బ్లడ్ ఆల్కహాల్ ఏకంగా 233 పాయింట్ల మేర ఉండటంతో షాకైన విషయం తెలిసిందే. పటాన్ చెరువుకు చెందిన హర్షవర్థన్ రెడ్డిగా అతడ్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిందే.

ఈ ఘటన మర్చిపోకముందే మరోమారు హైదరాబాద్ లోని పాష్ ఏరియా అయిన బంజారాహీల్స్ లో మరో ఘటన జరిగింది. అయితే పోలీసులకు పట్టుబడిన మధ్యం బాబులు.. తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. బంజారాహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన కొందరు వ్యక్తులు నానా హంగామా చేశారు. తమను వదిలి పెడతారో.. లేదంటే సస్పెండ్ అవుతారో తేల్చుకోవాలంటూ హెచ్చరించారు. అర్ధరాత్రి రోడ్‌ నంబరు 2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 2 గంటల సమయంలో ఓ కారును ఆపి డ్రైవర్‌కు శ్వాస పరీక్ష నిర్వహించగా బీఏసీ ఏకంగా 151గా నమోదైంది.

అతడిని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన వ్యాపారి టి.కిరణ్‌కుమార్‌రెడ్డి (34)గా గుర్తించారు. వాహనాన్నినిలిపివేశారు. విషయం తెలుసుకున్న అతడి బంధువులైన యెన్నం శ్రీధర్‌రెడ్డి (47), మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన హనుమంత్‌రెడ్డి (33), సైదాబాద్‌కు చెందిన వై.శ్రీకాంత్‌రెడ్డి, బోడుప్పల్‌కు చెందిన డ్రైవర్ వి.నరేందర్‌రెడ్డి (31) అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కారును వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ నడిరోడ్డుపై కూర్చోని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారును విడిచిపెట్టకుంటే ఎమ్మెల్యేకు చెప్పి సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని  పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles