ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపి కార్యకర్తలు దాడికి దిగారు. దేశంలోని ప్రజల నడవడిక ఎలా వుండాలో.. ఎలా ఉండకూడదో.. అంటూ హీతోక్తులు చెప్పే పార్టీకి చెందిన కార్యకర్తలు.. గీత దాటి ఏకంగా ముఖ్యమంత్రి నివాసంపైనే దాడికి దిగారు. ఆయన ఇంటిపై ఏకకాలంలో ఒక మూక దాడి చేసి.. సిసి కెమెరాలను ధ్వంసం చేసింది. ఇంటి బయట ఉన్న బారికేడ్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు భీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ సివిల్ లైన్స్‌లోని సీఎం ఇంటి బయట బారికేడ్లను తొలగించి ఆందోళనలు చేపట్టారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై బీజేపి కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారన్న సమాచారం కూడా రాబట్టుకోలేని ఇంటెలిజెన్స్ ఢిపార్టుమెంటు ఏం చేస్తోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి,. మరోమారు ఇంటెలిజెన్స్ శాఖ పూర్తిగా విఫలయమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచాల్సిన పోలీసులు కూడా చేష్టలుడికి చూడటం వెనుక ఆప్ పార్టీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో కాషాయ పార్టీ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ప్రదర్శన చేపట్టారు. కశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపిన కశ్మీర్ పండిట్ల ఊచకోత అవాస్తవమని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే ఇవాళ బీజేపీ గూండాలు సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని హింసకు పాల్పడ్డాయని సిసోడియా పేర్కొన్నారు.
కాషాయ గూండాలు సెక్యూరిటీ బారికేడ్లను పగులగొట్టారని, సీసీటీవీలను ధ్వంసం చేశారని పోలీసుల కండ్ల ముందే ఇవన్నీ జరిగాయని అన్నారు. కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు ముందస్తు ప్రణాళికతోనే దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇక సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు. గతంలోనూ కేజ్రీవాల్‌పై కాషాయ పార్టీ దాడులకు తెగబడిందని గుర్తుచేశారు. ఏదో సాకుతో కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో ఆప్ విజయంతో బెంబేలెత్తిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులతో కుమ్మక్కై ముఖ్యమంత్రిపై దాడులకు కుట్రపన్నుతోందని ఆరోపించారు.
माननीय मुख्यमंत्री @arvindkejriwal जी के आवास पर भाजपा के गुंडों द्वारा करा गया हमला बेहद निंदनीय है. पुलिस की मौजूदगी में इन गुंडों ने बैरिकेड तोड़े, सीसीटीवी कैमरा तोड़े. पंजाब की हार की बौखलाहट में भाजपा वाले इतनी घटिया राजनीति पर उतर गए. pic.twitter.com/ewzhqQgYyU
— Raghav Chadha (@raghav_chadha) March 30, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more