Horrific Accident In Delhi, SUV Runs Over Pedestrian దేశరాజధాని ఢిల్లీలో ఒళ్లు గగ్గుర్పోడిచే హిట్ అండ్ రన్ ఘటన..

Video shows horrific accident in central delhi suv runs over pedestrian

SUV mowed down pedestrian, speeding SUV runs over a man, Chilling footage of a hit-and-run, hit-and-run incident in Delhi, driver of the car still missing, delhi accident, delhi accident news, delhi accident, CCTV cameras, Central Delhi, Janpath Area, viral video, video viral, Chilling video, Horrific video

Chilling footage of a hit-and-run incident in Delhi's Janpath, in which a speeding car runs over a man and drives away. Footage captured by CCTV cameras in the Central Delhi area shows the SUV speeding after which it runs over a pedestrian, thereby killing him on the spot. The pedestrian, 39, has been identified by the police. The driver of the car did not stop the car after the incident and is still missing, police said.

ITEMVIDEOS: దేశరాజధాని ఢిల్లీలో ఒళ్లు గగ్గుర్పోడిచే హిట్ అండ్ రన్ ఘటన..

Posted: 03/30/2022 05:58 PM IST
Video shows horrific accident in central delhi suv runs over pedestrian

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్‌ ఢిల్లీలోని జనపథ్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. హిట్ అండ్ రన్ గా కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్యూవీని నడిపిన వ్యక్తి ఎవరు అన్న విషయమై అన్వేషణ సాగిస్తున్నారు. రోడ్డును దాటుతున్న వ్యక్తి అవతలి వైపుకు చేరుకుని ఫుట్ పాత్ ఎక్కినా.. మరణాన్ని మాత్రం తప్పించుకోలేకపోయాడు. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే పాదచారి మృత్యువాత పడ్డాడు.

వేగంగా దూసుకెళ్తున్న ఒక ఎస్‌యూవీ వాహనం రోడ్డు దాటుతున్న పాదచారిని ఢీకొనింది. ఈ ఘటనలో 39 ఏండ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండగా వెళ్లిపోయాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారు షాకయ్యారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరారు. వాహనం దూసుకెళ్లిన ఘటనలో మరణించిన వ్యక్తిని గుర్తించారు. అతడ్ని ఢీకొట్టిన వాహనం డ్రైవర్‌ గురించి ఇంకా ఏమీ తెలియలేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ వాహనం డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ వీడియో నెట్టింట్లో పోస్టు చేయడంతో పలవురు నెటిజనులు ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా అనిపించడం లేదుని.. కావాలని చేసినట్టుగా ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాగా మృతుడు ఎవరన్నది గుర్తించిన పోలీసులు.. వాహనం నడిపిన వ్యక్తిని మాత్రం ఇంకా గుర్తించలేదు. వాహనదారుడు ఇప్పటికీ పరారీలోనే వున్నాడని పోలీసులు చెప్పడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles