Centre seeks to change rules related to vehicles' fitness testing త్వరలో ఏటీఎస్ కేంద్రాల్లో వాహన ఫిట్ నెస్ తప్పనిసరి..

Government proposes ats test mandatory experts seek adequate facilities

automated testing station, Ministry of Road Transport and Highways (MoRTH), vehicles' fitness, testing outside the state of registration, automatic transmission, fitness testing of vehicles, heavy goods vehicles, heavy passenger motor, medium goods vehicles, medium passenger motor vehicles, light motor vehicles, June 1, 2024

The government on proposed certain amendments in the eligibility criteria for setting up an automated testing station to check vehicles' fitness, rules to enable vehicle testing outside the state of registration and the norm to declare a vehicle as end-of-life vehicle.

వాహనదారులకు అలెర్ట్: త్వరలో ఏటీఎస్ కేంద్రాల్లో ఫిట్ నెస్ తప్పనిసరి..

Posted: 03/28/2022 04:30 PM IST
Government proposes ats test mandatory experts seek adequate facilities

వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీ కోసం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొన్ని సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం.. ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలు మరొక రాష్ట్రంలో ఫిట్‌నెస్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు వెహికిల్‌ వ్యాలిడిటీ ముగిసిందని ఈ కేంద్రాలు ప్రకటించవచ్చు. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల గుర్తింపు, నియంత్రణ, నిబంధనలలో సవరణలు చేయడానికి మార్చి 25, 2022న డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో కొన్ని చిన్న మార్పులు కూడా ప్రతిపాదించారు.

ఏటీఎస్ లో నిర్వహించాల్సిన పరీక్షల జాబితా, ఇన్ స్టాల్ చేయాల్సిన పరికరాల నిర్దిష్ట వివరాల గురించి ప్రతిపాదించారు. ఫిట్‌నెస్ పరీక్ష ఫలితాలు ఆటోమేటిక్‌గా మారడంతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఫిట్‌నెస్ పరీక్షలో వాహనాలను తనిఖీ చేసే సిగ్నల్స్‌ యంత్రం నేరుగా విషయాన్ని సర్వర్‌కు పంపుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి దశలవారీగా ఏటీఎస్‌ ద్వారా వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిబంధన దశలవారీగా అమలు చేస్తుంది.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి ఏటీఎస్ ద్వారా భారీ వస్తువుల వాహనాలు, భారీ ప్యాసింజర్ మోటారు వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి. మధ్యస్థ వస్తువుల వాహనాలు, మధ్యస్థ ప్రయాణీకుల మోటారు వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల (రవాణా) విషయంలో జూన్ 1, 2024 నుంచి అమలుచేస్తారు. వ్యక్తిగత వాహనం (నాన్ ట్రాన్స్‌పోర్ట్) ఫిట్‌నెస్ టెస్టింగ్ 15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ఆగస్టులో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించి, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా నిర్మూలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాహన స్క్రాపేజ్ విధానం 1 ఏప్రిల్ 2022 నుంచి వర్తిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles