Will Smith slapped Chris Rock on the Oscars stage క్రిస్‌ రాక్‌ కు ‘బెస్ట్‌ యాక్టర్‌’ విల్‌ స్మిత్‌ క్షమాపణలు

Chris rock won t file police complaint against will smith after oscars assault

will smith, chris rock, jada pinkett smith, will smith slaps chris rock, chris rock joke, why will smith slapped chris rock, will smith slapping video, oscars 2022, will smith chris rock attack, oscars, oscars 2022

The 94th Academy Awards had the audience shocked as actors Will Smith and Chris Rock had an altercation. As Chris Rock took the Oscars stage to present the best documentary award, the comedian made a joke about the actor’s wife, actor Jada Pinkett Smith. While Will laughed a bit in the beginning, Jada was seen rolling her eyes. Soon after, Will went up to the stage and slapped Chris on the face.

ఆస్కార్‌ వేడుకల్లో అనుకోని ఘటన.. క్రిస్‌ రాక్‌ కు ‘బెస్ట్‌ యాక్టర్‌’ విల్‌ స్మిత్‌ క్షమాపణలు

Posted: 03/28/2022 03:32 PM IST
Chris rock won t file police complaint against will smith after oscars assault

ఆస్కార్‌ వేడుకల్లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోబోతున్న నటుడు విల్ స్మిత్.. కమేడియన్ కు క్షమాపణలు చెప్పాల్పివచ్చింది. ఎందుకుంటే అంతకుముందు ఉత్తమ నటుడి ఆగ్రహాన్ని కమేడియన్ చవిచూడాల్సి వచ్చింది. నిండుసభలో వేదికపైకి వెళ్లిన ఉత్తమ నటుడు సభాసతులు అందరూ చూస్తుండగా కమేడియన్ చెంప చెల్లుమనిపించాడు. నటుడు విల్‌ స్మిత్‌(53)కు ఎట్టకేలకు ఆస్కార్‌ దక్కింది. ‘కింగ్‌ రిచర్డ్‌’ సినిమాకుగానూ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును ఆయన అందుకున్నాడు. అయితే.. ఈవెంట్‌ సందర్భంగా జరిగిన ఓ ఘటన సినీ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆస్కార్స్‌ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్‌ స్మిత్‌, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించాడు.

బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్‌ ఎక్కిన క్రిస్‌.. ఏదో మాట్లాడుతూ విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌ మీద జోక్‌ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్‌ మీద క్రిస్‌ జోక్‌ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్‌ స్మిత్‌ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. స్టేజ్‌ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లి క్రిస్‌ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్‌ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్‌ స్మిత్‌.

ఇదంతా లైవ్‌ రికార్డులో ప్లే కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో స్పష్టత లేదు. కానీ, క్రిస్‌ వ్యక్తిగతంగా   కలిసి ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు నిర్వాహకులు విల్‌ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పినట్లుగా ఒక ఫొటో వైరల్‌ అవుతోంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విల్‌ స్మిత్‌.. క్రిస్‌ పట్ల తాను వ్యవహరించిన తీరుకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు.

అమెరికన్‌ నటుడు అయిన విల్‌ స్మిత్‌(విలియర్డ్‌ కారోల్‌ స్మిత్‌ 2).. మెన్‌ ఇన్‌ బ్లాక్‌, ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌, హ్యాంకాక్‌, ఐ యామ్‌ లెజెండ్‌ లాంటి సినిమాలతో విల్‌ స్మిత్‌ ఇండియన్‌ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’, ‘కింగ్‌ రిచర్డ్‌’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్‌ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్‌ ప్రిన్స్‌గా పేరున్న విల్‌ స్మిత్‌కు ఆస్కార్‌ 2022లో అవార్డు ముచ్చట తీరింది.  కింగ్‌ రిచర్డ్‌లో వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి పాతర రిచర్డ్‌ విలియమ్స్‌ రోల్‌లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్‌ దక్కించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : will smith  chris rock  jada pinkett smith  chris rock joke  oscars 2022 stage  apology  oscars 2022  

Other Articles