NPPA hikes prices of 800 essential drugs from 1 April అత్యవసర 800 ఔషధాల ధరల పెంపు..

Over 800 essential medicines including paracetamol to get expensive from april

rise in drug prices, npp,drugs, medicine, pharma industry, antibiotics, anti-inflammatory drugs, ear-nose and throat medicines, antiseptics, painkillers, Drugs Price Control Order, WPI, National Pharmaceutical Pricing Authority (NPPA)

In a major development, the National Pharmaceutical Pricing Authority (NPPA) has announced a hike in prices of around 800 essential drugs from 1 April. The rise in drug prices works out at around 10.76% based on the Wholesale Price Index (WPI) data.

ఏప్రిల్ 1 నుంచి.. అత్యవసర 800 ఔషధాల ధరల పెంపు..

Posted: 03/26/2022 07:35 PM IST
Over 800 essential medicines including paracetamol to get expensive from april

దేశంలో ఈ ఏడాది చివరి వరకు ఏ రాష్ట్ర ఎన్నికలు లేవు. దీంతో అన్ని సరుకుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, వంటనూనె ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలకు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్యులకు అవి అందకుండా పోయాయి. దేశంలో అన్నమో రామచంద్రా అంటూ అరిచే ఆర్తనాధాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచలోని 116 దేశాల జాబితాలో మన దేశంలో అన్నం కోసం అంగలార్చే వారి సంఖ్య చాలా ఎక్కువని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఉంది.

ఈ సూచిక‌లో 116 దేశాలు ఉంటే.. భార‌త్ 101వ స్థానంలో నిలిచింది. అంటే దేశంలో పేదవారి ఆకలి బాధలు అధికమయ్యాయని ఇట్టే అర్థమవుతున్నాయి. ఇది చాలదన్నట్లు వారు అనారోగ్యం బారిన పడితే చికిత్సలో భాగంగా వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకోవాలంటే కూడా ఇప్పుడు పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనిషి అనారోగ్యం బారిన పడితే వేసుకునే అత్యవసర ఔషధాల ధరలు కూడా పెరగబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజూవారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు పెరగనున్నట్లు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. పలు మెడిసిన్స్ ధరలు 10.7 శాతం పెరగనున్నట్లు తెలిపింది.

పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో సహా అవసరమైన మందుల ధరలు పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జ్వరం, ఇన్ఫెక్షన్స్‌, గుండె జ‌బ్బులు, హైబీపీ, చ‌ర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉప‌యోగించే ఔషధాల ధరలు పెర‌గ‌నున్నాయి. ఈ మేరకు ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసిట‌మాల్‌, ఫెనోబ‌ర్బిటోన్‌, అజిత్రోమైసిన్‌, సిఫ్రాన్‌, హైడ్రోక్లోరెడ్‌, మెట్రిండ‌జోల్ వంటి మందుల ధ‌ర‌లు ప్రజలకు భారం కానున్నాయి. 2021 క్యాలెండ‌ర్ సంవ‌త్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డ‌బ్ల్యూపీఐ)లో 10.7 శాతం స‌వ‌రించిన‌ట్టు ఎన్‌పీపీఏ అధికారులు వెల్లడించారు. క‌రోనా కార‌ణంగా ఔష‌ధాల‌ తయారీ ఖర్చులు కూడా పెరగడంతో వాటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles