Kid crying in theatre watching Ram Charan beaten by NTR ‘ఆర్ఆర్ఆర్’ ఆ సన్నివేశం చూస్తూ ఏడ్చిన బాలుడు

Kid crying in theatre watching emotional scene in rrr movie

Ram Charan little Fan cries in Theatre, Cherry little fan cries in Theatre, NTR beats Ram Charan, Ram Charan little fan, fighting, Ram Charan, Child, cried, fight, RRR Movie, NTR, RAM, RRR, Tarak, unbearably, Bhem, Tollywood

A child gets hurt when Tarak hits Charan. child cried in the theater saying that Charan was being beaten by NTR .. why he was being beaten like that .. his mother next door .. it was the movie Nanna .. not really hit .. Sardi tried to say. Now the video tribe is going viral.

ITEMVIDEOS: మా రాంచరణ్‌ను ఎన్టీఆర్ కొడ్తుండూ... ‘ఆర్ఆర్ఆర్’ చూస్తూ ఏడ్చిన బాలుడు

Posted: 03/26/2022 04:49 PM IST
Kid crying in theatre watching emotional scene in rrr movie

మెగా పపర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపోందిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే ఎన్నో సంచలనాలకు కారణమైంది. ఈ చిత్రం చూసిన ప్రతీ ప్రేక్షకుడు మరోసారి సినిమాను చూడాలన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ వీక్షించేందుకు ఇద్దరు హీరోల అభిమానులు పోటెత్తారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గల థియేటర్ల వద్ద రెండో రోజు కూడా తొలి రోజు నెలకొన్న సందడి నెలకొనింది. ఇద్దరు హీరోలు పోటాపోటీగా పోటీపడి మరీ నటించిన ఈ చిత్రంలో అభిమానుల సందడికి హద్దులు లేకుండా పోయాయి.

ఇద్దరు హీరోలు ఉన్న చిత్రంలో ఇద్దరీ మధ్య ఫైట్ సీన్ లేకపోతే ఎక్కడో వెలతి ఉంటుదన్న విషయం తెలిసిందే. అయితే, సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మ‌ధ్య జ‌రిగే ఫైట్ సీన్ చూసిన ఓ బాలుడు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. థియేట‌ర్లోనే గ‌ట్టిగా ఏడ్చేశాడు. సినిమాను, అందులో నటీనటులను.. అందులోనూ తాము ఎంతగానో అభిమానించే నటుడికి అపద రావడంతో వారిపట్ల తమకు ఎంత అభిమానముందో అప్పుడప్పుడు అనుకోకుండా బయటపడుతుంటది. తాజాగా కూడా సినిమా థియేటర్‌లో ఓ చిన్న సన్నివేశం చోటు చేసుకుంది. దీంతో అక్కడున్నవారంతా చూసి ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే.. ఓ సినిమా థియేటర్‌లో ఓ బాలుడు ఆర్ఆర్ఆర్ మూవీని చూస్తున్నాడు. ఓ సీన్‌లో ఎన్టీఆర్‌.. రామ్‌చ‌ర‌ణ్ కొడుతుంటాడు. అంతే ఆ బాలుడు బిగ్గ‌ర‌గా ఏడ్వ‌డం మొద‌లుపెట్టాడు. ఏమీ అన‌కున్నా త‌న హీరోని కొడుతున్నారంటూ గోల‌గోల చేశాడు. రామ్‌చ‌ర‌ణ్‌ను ఈ సినిమాలో విల‌న్‌ను చేశారంటూ విల‌పించాడు. ఈ సీన్ చూసి మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయిన ఆ బాలుడి ఫ్యామిలీ, త‌ర్వాత గ‌ట్టిగా న‌వ్వుకున్నారు. వాళ్లిద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తారులే.. ఏడ్వ‌కు అంటూ బాలుడిని బుజ్జ‌గించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లంతా న‌వ్వుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan little fan  fighting  Ram Charan  Child  cried  fight  RRR Movie  NTR  RAM  RRR  Tarak  unbearably  Bhem  Tollywood  

Other Articles