Petrol, Diesel Prices Hiked Again మళ్లీ పెరిగిన ఇంధన దరలు.. వాహనదారులకు మచ్చెమటలు..

Petrol diesel prices hiked again fourth time in five days

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices were hiked by 80 paise a litre each today, the fourth increase in five days as oil firms passed on to consumers the spike in cost of raw material. Petrol in Delhi will now cost ₹ 98.61 per litre as against ₹ 97.81 previously while diesel rates have gone up from ₹ 89.07 per litre to ₹ 89.87, according to a price notification of state fuel retailers.

మళ్లీ పెరిగిన ఇంధన దరలు.. వాహనదారులకు మచ్చెమటలు..

Posted: 03/26/2022 11:17 AM IST
Petrol diesel prices hiked again fourth time in five days

ఇంధన ధరలపై కేంద్రం దారి ముందు ఒకలా వెనుక మరోలా ఉంది. ఓ వైపు ఇంధన సంస్థలతో ధరలను రోజురోజుకు పెంచుతూపోమ్మని చెబుతూనే.. ఇంధన ధరలలో కేంద్రం విధించే పన్ను చాలా తక్కువని, ఇక రాష్ట్రాల పన్నుభారమే బేసిక్ ఇంధన ధరల కన్నా ఎక్కువగా ఉందని ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుంటూ పోతోంది. అయితే ఆ రాష్ట్రంలోని ఇంధన అమ్మకాలపైనే రాష్ట్రాల పన్ను వర్తించనుంది. మరీ దేశంలోని  ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర పన్ను పడుతుందన్న విషయం తెలిసిందే. ఇలా రాష్ట్రాల వారీగా అమ్మకాల వివరాలు తీసి.. లెక్కలు వేసి.. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల లాభాన్ని అర్జించింది కేంద్రమా.? లేక రాష్ట్రాలా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఈ విషయాలను పక్కనబెడితే.. ఐదు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో గత ఆరేళ్లుగా కేంద్రం ప్రకటనలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. గత ఎన్నికలకు ముందు ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయమై కేంద్రం ఆలోచిస్తుందని చెప్పుకోచ్చిన అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తరువాత అందుకు రాష్ట్రాలు అంగీకరించడం లేదని చేతులెత్తేశారు. ఈ 2021లో జరగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఇంధన ధరలను పెంచేది లేదని,  ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పినా.. ఫలితాల ప్రకటనకు ముందే ధరలు పెరగడంతో అవి నీటిమూటలేనని తేలిపోయాయి.

ఇక తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల పాట పెంపుకు స్వస్తి పలికిన ఇంధన సంస్థలు.. ఇక మళ్లీ వరస వాయింపులకు సిద్దమయ్యాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. తాజాగా ఏకంగా 80 పైసల మేర పెంచుతుండటం గమనార్హం. ఇక ఇవాళ కూడా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 80 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 80 పైసల వరకూ పెంచాయి. గత నాలుగు పర్యాయాల పెంపుతో ఇంధన ధరలు రూ.3.20 మేర పెరిగాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 98.61కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 89.87కు పెరిగింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 98.61గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 89.87కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 113.35గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.55కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 104.43గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.47కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 108.01గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 93.01కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 113.60 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 99.50కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 113.53గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.00కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 111.80గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 98.10కు చేరింది.
బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర 103.02 నమోదు కాగా, డీజిల్‌ ధర రూ. 88.40 పైసలకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles