Mamata urges not to make unwarranted statements గుజరాత్, రాజస్థాన్ లోనూ బీర్భూమ్ తరహా ఘటనలు: సీఎం

Am not justifying but this has happened in gujarat too mamata on bengal arson deaths

Mamata Banerjee on Rampurhat violence, Mamata banerjee on Birbhum violencr, mamata banerjee calls governor laadsahab, Governor Jagdeep Dhankar, Mamata Banerjee, TMC govt, West Bengal violence, Gujarat violence, Rajasthan violence, Rampurhat violence, West Bengal, Crime, Politics

Facing all-round recrimination for the recent mass killings in West Bengal, Chief Minister Mamata Banerjee pointed out Wednesday that such incidents have happened in Gujarat and Rajasthan as well. Banerjee was quick to add: “I am not justifying the incident in Rampurhat. We will take action in a fair manner.”

గుజరాత్, రాజస్థాన్ లోనూ బీర్భూమ్ తరహా ఘటనలు: సీఎం

Posted: 03/23/2022 06:21 PM IST
Am not justifying but this has happened in gujarat too mamata on bengal arson deaths

బీర్భూమ్ జిల్లాలో జ‌రిగిన స‌జీవ ద‌హ‌నం విష‌యంపై బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌లో కూడా చోటు చేసుకున్నాయ‌ని వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ సంఘ‌ట‌న‌ల‌ను ఏమాత్రం స‌మ‌ర్థించ‌డం లేద‌ని, పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తోనే విచార‌ణ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ‘ఈ ప్ర‌భుత్వం మ‌న ప్ర‌భుత్వం. రాష్ట్ర ప్ర‌జ‌ల విష‌యంలో ఆందోళ‌న‌లు చెందుతున్నాము. ఎవ్వ‌రూ ఇబ్బందులు ప‌డ‌టం మాకు ఇష్టముండ‌దు. బీర్భూమ్‌, రాంపూర్‌హ‌ట్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు అత్యంత దుర‌దృష్ట‌క‌రం. వెంట‌నే ఓసీ, య‌స్‌డీపీఓ అధికారుల‌ను డిస్మిస్ చేస్తున్నారు.

కాగా గురువారం మమతా బెనర్జీ రాంపూర్‌హ‌ట్‌ను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి ప్ర‌క‌టించారు. ఇక సంఘ‌ట‌నా స్థ‌లాన్ని బీజేపీ నేత‌లు సంద‌ర్శించ‌డంపై దీదీ స్పందించారు. ‘ఇది బెంగాల్‌. యూపీ కాదు. హాథ్ర‌స్ ఘ‌ట‌న నేప‌థ్యంలో తృణ‌మూల్ నేత‌లు అక్క‌డికి వెళ్లారు. వారిని పోలీసులు వెళ్ల‌నివ్వ‌లేదు. కానీ.. మేమ‌లా చేయ‌డం లేదు. మేము ఎవ్వ‌ర్నీ ఆప‌డం లేదు’ అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ చుర‌క‌లంటించారు. పశ్చిమబెంగాల్‌లో బీర్భుమ్‌ జిల్లాలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే.

బీర్భుమ్‌ జిల్లాలోని రాంపూర్‌హట్‌ శివారులోని బొగ్తూయ్‌ గ్రామంలో ఎనిమిది ఇండ్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది సజీవ దహనమయ్యారు. బర్షాల్‌ గ్రామంలో టీఎంసీ నేత భదు సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన కొద్ది గంటలకే అంటే మంగళవారం తెల్లవారుజామున దుండగులు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఏడుగురి మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో ఉండగా, ఒకరు మాత్రం దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు డీజీపీ మనోజ్‌ మాలవీయ తెలిపారు. ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles