Siricilla Rajaiah evicted in daughter in law case కోడ‌లి స‌జీవ ద‌హ‌నం కేసులో సిరిసిల్ల రాజ‌య్య‌ నిర్ధోషే.!

Siricilla rajaiah and family evicted in daughter in law case

Siricilla Rajaiah, Siricilla Rajaiah evicted, Siricilla Rajaiah daughter in law death, Siricilla Rajaiah wife Madhavr, Siricilla Rajaiah son Anil, Siricilla Rajaiah daughter in law death news, Siricilla Rajaiah grand children death case, Siricilla Rajaiah congress, Siricilla Rajaiah warangal, Madhavi, Anil, Sarika, daughter in law, Grand Children, Immolation, congress, warangal, Telangana, Politics, Telangana news

A local court in Telangana's Hyderabad district gives a big relief to to former Congress MP Siricilla Rajaiah. Along with his wife Madhavi and son Anil who were accused for allegedly abetting the suicide of his daughter-in-law and three young grandsons were evicted in the case.

కోడ‌లి స‌జీవ ద‌హ‌నం కేసులో సిరిసిల్ల రాజ‌య్య‌ సహా ముగ్గురు నిర్ధోషులే.!

Posted: 03/23/2022 05:36 PM IST
Siricilla rajaiah and family evicted in daughter in law case

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, వ‌రంగ‌ల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్ల‌ల‌తో పాటుగా ఆయ‌న ఇంటిలోనే స‌జీవ ద‌హనం అయిన కేసులో రాజ‌య్య‌పై పోలీసులు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుడు అనిల్‌, భార్య మాధ‌వి కూడా ఈ కసులో నిందితులుగా చేర్చారు పోలీసులు. సరిగ్గా రాష్ట్రంలో ఉపఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామంతో రాజయ్య తీవ్ర మనస్తాపం చెంది ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

అంతేకాదు ఈఘటన నేపథ్యంలో రాజయ్య రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. 2015లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన హైద‌రాబాద్‌లోని ప్ర‌త్యేక కోర్టు తుది తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో రాజయ్య‌తో పాటు ఆయ‌న కుమారుడు అనీల్, భార్య మాధవి నిర్దోషులేన‌ని కోర్టు తీర్పు చెప్పింది. కాగా కోర్టు తీర్పుపై రాజయ్య కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, రాజయ్యకు ఆయన మనవళ్లు, మనవరాళ్లు అంటే అమితమైన ప్రేమ. దాంతో ఆయన అప్పట్నించీ మానసికంగా కుంగిపోయారని ఆయన సన్నిహుతులు పేర్కోన్నారు.

ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే.. 2015 నవంబర్ 4 తెల్లవారుజామున వ‌రంగ‌ల్‌లోని రాజ‌య్య ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు అభినవ్(7), ఆయోన్(3), శ్రీయోన్(3) లు సజీవ దహనమయ్యారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్య సహా ఆయన భార్యను, కొడుకును అదుపులోకి తీసుకొని 498ఎ, 306, 176 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు విచార‌ణ‌ను నిర్వహించిన నాంప‌ల్లిలోని ప్రత్యేక కోర్టు మంగ‌ళ‌వారం తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siricilla Rajaiah  Madhavi  Anil  Sarika  daughter in law  Grand Children  Immolation  congress  warangal  Telangana  Politics  

Other Articles