President, PM express grief at Telangana fire mishap అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్బ్రాంతి..

Death of workers in telangana fire accident is tragedy beyond words president kovind

President on Hyderabad fire accident, President on bihar migrants deaths, President Ramnath Kovind, Prime Minister Narendra Modi, PM Modi on Hyderabad Fire Accident, PM modi on Bihar Migrant labourers death, Bihar migrants charred to death, President, Ramnath Kovind, Prime Minister, Narendra Modi, Hyderabad Fire Accident, Bihar Migrant labours, charred to death, Pm exgratia, Revanth Reddy, Hyderabad, Telangana, Crime

President Ram Nath Kovind Wednesday said that the death of workers in a fire accident in Secunderabad is a tragedy beyond words as he offered prayers for the bereaved families. Eleven migrant workers were charred to death in the major fire accident at a scrap godown in the early hours of Wednesday, officials said.

అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్బ్రాంతి.. బాధిత కుటుంబాలకు సంతాపం

Posted: 03/23/2022 01:30 PM IST
Death of workers in telangana fire accident is tragedy beyond words president kovind

బోయిగూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న శ్రవణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోదాంలోని వలస కార్మికుల మృతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, సీఎస్, సోమేష్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రమాదఘటనపై సమాచారం అందగానే నేరుగా ఘటనాస్థలానికి వచ్చారు. ప్రమాదానికి గల కారణాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకుని.. స్వయంగా పరిశీలించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. అంతేకాకుండా మృతదేహాలను వారి సొంతూళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. గోదాంకు ఉన్న అనుమతులను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కూడా ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

బోయిగూడ స్క్రాప్ గోడౌన్‌ లో సంభవించిన పెను అగ్ని ప్రమాదం నగరంలో విషాదాన్ని నింపింది. వేకువజామున జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాద కుటుంబాలకు రాష్ట్రపతి కోవింద్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ధుఃఖసమయంలో తన ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

సికింద్రాబాదులోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. అర్థరాత్రి గాఢనిద్రలోకి జారుకున్న కార్మికులు.. ప్రమాదానికి గురై సజీవదహనం కావడం కలచివేస్తోందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles