బోయిగూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న శ్రవణ్ ట్రేడర్స్ స్క్రాప్ గోదాం నిబంధనలకు నీళ్లు వదలడం వల్లే ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు అరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదాం యజమాని సంపత్ గా అధికారులు గుర్తించిన అధికారులు.. అతన్ని అడుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు. స్క్రాప్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్లో మంటలు వ్యాపించాయని. ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. గోదాం విస్తీర్ణం సుమారు వెయ్యి గజాలలో ఉన్నప్పటికీ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒక్కటే ప్రవేశం ఉండటం వల్లే లోపన ఉన్న కార్మికులు తప్పించుకునే మార్గంలేక బలైపోయారని అన్నారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. గోదాం లోపలి భాగంలో పెద్ద ఎత్తున సీసాలు, ఇతర ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. మంటల దాటికి సీసాలు పగిలిపోయి చెల్లా చెదురుగా లేనికి వెళ్లలేని విధంగా పడిపోయాయి.
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న షెడ్డుకు ఫైర్ విభాగం నుండి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. దీనికి తోడు లోపలి భాగంలో ఎలాంటి అగ్ని ప్రమాద రక్షణ చర్యలు లేవు. జీహెచ్ఎంసీ, కార్మిక విభాగాల నుండి కూడా ఎలాంటి అనుమతులు లేవని కమీషనర్ తెలిపారు. అలాగే గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా బిహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు. అయితే గాంధీ నగర్ పోలీసులు గోదాం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు.
అగ్ని ప్రమాద మృతులంతా బీహార్ రాష్ట్రంలోని జిల్లా ఛాప్రాకు చెందినవారు. సుమారు రెండేళ్లుగా వీరు ప్రమాదం జరిగిన గోదాంలో పని చేస్తున్నారు. వీరిలో కొంతమందికి వివాహం కాగా పెండ్లి కాని వారు కూడా ఉన్నారు. అయితే వీరందరిని గుర్తించాల్సి ఉంది. వీరంతా నెలకు రూ. 12 వేల జీతానికి పని చేస్తున్నారు. వీరిలో కొంతమంది మరో పది రోజులలో ఇంటికి వస్తామని కుటుంబ సభ్యులతో చెప్పగా ఇంతలో దారుణం జరిగిపోయింది. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)గా గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more