RIMS refers Lalu to AIIMS ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్ లాలూ యాదవ్..

Lalu prasad yadav s health worsens being shifted to delhi aiims

Lalu Prasad Yadav, AIIMS Delhi, Ranchi RIMS, Lalu Yadav, Rashtriya Janata Dal, Lalu Prasad Yadav News, Lalu Prasad Yadav Health, Lalu Prasad Yadav News, Lalu Yadav News, Lalu Yadav health News, Lalu Prasad Yadav, RJD, Fodder Scam, Health worsens, AIIMS Delhi, Ranchi RIMS, Rashtriya Janata Dal, Bihar Politics

Rashtriya Janata Dal (RJD) leader Lalu Prasad Yadav is being taken to the AIIMS Delhi from Rajendra Institute of Medical Sciences (RIMS) in Ranchi on Tuesday after his health condition worsened. "It was found that he has issues in his heart and kidney. He is being sent to AIIMS Delhi for better treatment. The jail officials will decide (the date)," said Kameshwar Prasad, Rajendra Institute of Medical Sciences (RIMS) Director.

రిమ్స్ నుంచి ఎయిమ్స్ కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఆరోగ్యం క్షీణించడంతో..

Posted: 03/22/2022 04:14 PM IST
Lalu prasad yadav s health worsens being shifted to delhi aiims

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. దాణా కుంభకోణంలో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తున్న ఆయన ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. దీంతో ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్) నుంచి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

క్రియాటిన్‌ లెవల్‌ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్‌ చేసినట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles