Wooden treadmill catches KTR’s eye చెక్క ట్రెడ్‌మిల్‌ రూపకర్త మండపేట వాసి

Ktr eye caught treadmill is carved by mandapeta carpenter srinivas

Wooden Treadmill, T Works, IT Minister, KT Rama Rao, product innovation, rural innovators, Arunn Bhagavathula, no electricity, disruptive design, Kadipu Srinivas, Mandapeta, East Godavari, Andhra Pradesh

Telangana government is trying to encourage rural innovators by providing them with an opportunity to showcase their products, by linking them with T-Works, the prototyping centre of IT&C Department. One such innovation drew the attention of IT Minister KT Rama Rao, who was so amazed, that he has directed T-Works to connect with the innovator and help him scale his product innovation.

ITEMVIDEOS: కేటీఆర్ దృష్టిలో పడిన చెక్క ట్రెడ్ మిల్‌ ఇదే.. రూపకర్త శ్రీనివాస్.!

Posted: 03/21/2022 03:37 PM IST
Ktr eye caught treadmill is carved by mandapeta carpenter srinivas

వడ్రంగి కళాకారుడు.. రూపోందించిన ఓ ట్రెడ్ మిల్ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి చేరింది. ఇది పూర్తిగా చెక్కతో చేసింది. ఇక దీనికి తోడు ఎలాంటి విద్యుత్ అవసరం లేని ట్రెడ్ మిల్ కావడంతో వడ్రింగి కళాకారుడి నైపుణ్యానికి మెచ్చిన కేటీఆర్.. తెలంగాణ టి వర్క్స్ శాఖ అధికారులకు అతడి ఆచూకీని కనుగొని అతడికి తగు ప్రోత్సహాం అందించాల్సిందిగా అదేశించారు. దీంతో అధికారులు అతడు ఏ జిల్లాకు చెందిన వ్యక్తో కనుగునేందుకు వేట ప్రారంభించారు. అందులోనూ స్వయంగా కేటీఆర్ తన అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీరా చూస్తే కథలో చిన్న మెలిక ఏర్పడింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయాన్నే ట్రెడ్ మిల్ కోసం జిమ్ కెళ్లినా.. లేక ఇంట్లో చేసినా.. అన్ని విద్యుత్ తీసుకుని.. మోటార్ ద్వారా రూపోందించినమే. అయితే ఈ వడ్రింగి కళాకారుడు చేసిన ట్రెడ్ మిల్ మాత్రం కేవలం.. కలప ద్వారా రూపొందించింది. ఇక ఎలాంటి విద్యుత్‌, మోటారు వినియోగం లేకుండా అతి తేలికగా నడుపుతున్న ఒక వడ్రంగి నైపుణ్యాన్ని చూసి మంత్రి కేటీఆర్‌ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తనకు ఒక నెటిజన్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోను షేర్ చేశాడని.. అతడి ఆచూకీని కనుగుని తగిన ప్రోత్సహాన్ని కల్పించాల్సిందిగా ఆయన టీ వర్క్స్ అధికారులకు అదేశించారు.

టీవర్క్స్‌ అధికారులు నెటిజన్‌ను సంప్రదించగా... తనకు ఆ వివరాలు తెలియవని.. వాట్సాప్‌ ద్వారా వచ్చిన వీడియోను మంత్రి కేటీఆర్‌కు పంపానని తెలిపారు. దీంతో అధికారులు ఆ కళాకారుని వివరాల వేటలో పడ్డారు. అయితే ఇది రూపోందించింది తెలంగాణకు చెందిన వ్యక్తి అనుకుని ఆ నెట్ జన్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, మంత్రివర్యులు కూడా అది తెలంగాణ కళాకారుడి ప్రతిభే అని భావించి.. టీ వర్క్స్ అధికారులకు అదేశాలించారు. తీరా చూస్తే.. అది రూపోందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వడ్రండి కళాకారుడు. కలపతో ట్రెడ్ మిల్ చేసి.. అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన వడ్రంగి కళాకారుడు కడిపు శ్రీనివాస్‌ చెక్కలతో ట్రెడ్‌ మిల్‌ రూపొందించి అబ్బురపరిచారు. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని.. రోజు వారీ పని చేసుకుంటూ ముందుగా కావలసిన టేకు చెక్కలు సిద్ధం చేసుకుని రాత్రి సమయంలో దీని రూపొందించినట్లు శ్రీనివాస్‌ చెప్పారు. ట్రెడ్‌ మిల్లు తిరగడం కోసం 60 బాల్‌ బేరింగ్‌లు ఉపయోగించానని, మొత్తంగా దీని తయారీకి రూ.12వేలు ఖర్చయిందని తెలిపారు. పరికరం పని తీరుపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మెచ్చుకుని తన అకౌంట్ ద్వారా రీట్వీట్ చేయడంతో కుడిపి శ్రీనివాస్ లైమ్ లైట్ లోకి వచ్చాడు. తెలంగాణ మంత్రులు కొందరు ఫోను చేసి వివరాలు తెలుసుకున్నారని శ్రీనివాస్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles