ఈ రోజుల్లో రూపాయిని యాచకులకు దానం చేసినా.. వారు తిరిగి ఇచ్చేస్తున్నారు. కొందరైతే రూపాయిని ఎగదిగా చూసి.. రూపాయికి ఏం వస్తుంది బాబు అని అడిగేస్తున్నారు. నిజమే ఎం వస్తుందని అలోచిస్తే.. ఠక్కున గుర్తుకువచ్చేదీ ఒక్కటీ తొచదు. కానీ అదే రూపాయికి ఇడ్డీ, మైసూర్ బజ్జీలను అందిస్తున్న హోటల్ మన అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందంటే మీకు నమ్ముతారా.? ఔనా కొత్తగా పెట్టారేమో.. పబ్లిసిటీ కోసం కొన్ని రోజులు ఇలానే ఆఫర్ ఇస్తారు. అలవాటు పడిన తరువాత.. రేటను అమాంతం పెంచేస్తారు. ఈ బిజినెస్ టెక్నిక్స్ అన్ని అందరికీ తెలుసులేండీ.? అంటారా.?
అయితే మీరు పోరబడినట్టే. ఎందుకంటే ఈ ఇక్కడ ఇడ్లీ మాత్రమే కాదు.. ఒక్క రూపాయికి మైసూర్ బజ్జీ కూడా వస్తుంది. అంతేకాదు.. వాటిని రుచికరంగా అరగించేందుకు మూడు రకాల చెట్నీలు కూడా ఇస్తారు..? ఔనా అని అలోచనలో పడ్డారా.?. నిత్యావసరాల సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఏడాది, రెండేళ్లు లోపు రెట్టింపు అవుతున్నాయి. ఏదీ కొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి రోజుల్లో చిన్న వ్యాపారులు సైతం రేట్లను రెట్టింపు చేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న రేట్లను కరోనా తరువాత భారీగా పెంచారు. కానీ ఆ హోటల్ యజమాని 16 ఏళ్ల నుంచి ఒకే రేటుకు ఫలహారం అందిస్తున్నారు.
రూపాయికే ఇడ్లీ అమ్మే ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా..? తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం-కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలో మీటర్ల దూరం వెళితే ఆర్బీ కొత్తూరు గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఉంది ఈ అతి చౌకైన హోటల్.. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ అలియాస్ రాంబాబు, రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసెలో 16 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్క రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూరు బజ్జీ కూడా ఒక్క రూపాయే. ఊళ్లోని ఇతర హోటళ్లు అన్నింట్లో తొలుత రూపాయికే ఇడ్లీ ఇచ్చేవారు.
కానీ సరుకుల ధరలు పెరగడంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. రాంబాబు మాత్రం ఇప్పటికీ రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. రాంబాబు హోటల్లో రుచికే కాదు శుచికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రత పాటిస్తూ టిఫిన్ అందిస్తారు. దీనికి నాణ్యత కూడా తోడవడంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ క్యూలో నిలుచుని మరీ టిఫిన్ చేస్తుంటారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్‌ను నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్‌కు వస్తారని తెలిపాడు.
రూపాయి అనే పదానికున్న ప్రత్యేకత వేరు. రూపాయికే వైద్యం అంటారు. రూపాయికే కిలో బియ్యం అంటారు. ఇవన్నీ జనం నోట్లో విపరీతంగా నానుతాయి. అందుకే నేను కూడా నష్టం రానంతవరకూ రూపాయికే ఇడ్లీ అమ్మాలనుకుంటున్నాను అన్నారు. అయితే ఈ విషయంలో తనను చాలా మంది ఇబ్బంది పెట్టారని.. ధర పెంచాలన్నారు. కానీ తనకు నచ్చలేదన్నారు. 16 ఏళ్ల కిందట అర్ధ రూపాయితో ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టాను అన్నారు. తన భార్య రాణి, అత్త రత్నావతి సహకారంతో ఇప్పటికీ అదే రేటుతో వ్యాపారం కొనసాగిస్తున్నాను అన్నారు. కేవలం నష్టం లేకుండా ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది తనకు చాలా సంతృప్తి కలిగిస్తుంది అంటున్నారు హోటల్ యాజమాని..
(And get your daily news straight to your inbox)
Aug 19 | దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడులన్నీ రాజకీయ కక్ష సాధింపులో బాగంగానే కొనసాగుతున్నాయిని విపక్షాలన్నీ ఏకపక్షంగా... Read more
Aug 19 | త్వరలో భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5G వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. దీంతో రాబోయే కాలంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి మరింత పెరుగుతుందని, ఈ రంగంలో ఉద్యోగాల... Read more
Aug 19 | భారతీయ స్టేట్ బ్యాంక్.. దేశంలోనే కాదు ఏకంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ బ్యాంకులో దొంగలు పడ్డారు. అయితే పడింది మాత్రం బయటి దొంగలు కాదు. ఏకంగా ఇంటి దొంగలే. అయితే... Read more
Aug 18 | పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడూ సరదా సంఘటనలు జరుగుతుంటాయి. చిన్నచిన్న కారణాలకే కొందరు గొడవ పడుతుంటారు. ఆ సీటు నాది అని.. కొంచెం అలా జరగాలని ఇలా పలు చిన్న కారణాలే కానీ.. ఆ... Read more
Aug 18 | హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రైలు ప్రయాణానికి పది గంటలు లేదా 11 గంటలు పడుతుంది. ఇకపై కేవలం రెండున్నర గంటల్లోనే బెంగళూరుకు వెళ్లొచ్చు. దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఐటీ హాబ్ కేంద్రాలు... Read more