End social media influence in electoral politics: Sonia Gandhi మత విద్వేషాలను రెచ్చగొడుతోన్న ఫేస్ బుక్: సోనియా గాంధీ

End facebook interference sonia gandhi to government citing report

Sonia Gandhi, Parliament, Facebook, Congress president Sonia Gandhi, social media companies, Indian democracy, Twitter, Social Media, Facebook, communal violence, BJP, Parliament Sessions, Lok Sabha, New Delhi, National Politics

Congress president Sonia Gandhi said global social media companies are being abused to hack India's democracy and urged the government to put an end to their "systematic influence and interference" in electoral politics.

మత విద్వేషాలను రెచ్చగొడుతోన్న ఫేస్ బుక్: సోనియా గాంధీ

Posted: 03/16/2022 03:21 PM IST
End facebook interference sonia gandhi to government citing report

ప్రపంచ దిగ్గజ సోషల్‌ మీడియా కంపెనీలు మన దేశ ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేలా వ్యహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆక్షేపించారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అమె కోరారు. ఇలాకానీపక్షంలో ఒక పద్దతి ప్రకారం జరుగుతున్న సామాజిక మాధ్యమ సంస్థల జోక్యం ఎలక్టోరల్ పాలిటిక్స్ ను ప్రభావితం చేయకుండా చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం ఆనన్నమైందని అన్నారు. ఇక దీనికి తోడు ఈ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు అధికార పార్టీలకు వత్తాసు పలుకుతన్నాయని అరోపించారు.

అధికార పార్టీ అలోచనలను అధికంగా ప్రజలపై రుద్దుతున్నాయని అమె ఆరోపించారు. ఈ సామాజిక మాద్యమ సంస్థలకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటిగా పరిగణించకుండా.. అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడటం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఫేస్‌బుక్‌ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని తెలిపారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. భారత రాజకీయాలు, ఎన్నికల్లో ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల జోక్యాన్ని తగ్గించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అల్ జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లో ప్రచురించిన రిపోర్టును సోనియా గాంధీ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే ఫేస్‌బుక్ ఎన్నికల ప్రకటనల కోసం బీజేపీకి మాత్రమే తక్కువ ధరలో డీల్‌ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగంలోని ఎన్నికల వ్యవస్థలో సోషల్‌ మీడియా జోక్యాన్ని క్రమంగా తగ్గించాలని కోరారు. సోషల్‌ మీడియం జోక్యాన్ని పక్షపాత రాజకీయాలకు అతీతంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పార్టీ ఆధికారంలో ఉ‍న్నా..బాధ్యతగా మనమంతా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles